‘ఆర్ఆర్ఆర్’ పోటీకి నై అంటున్న ‘ఇండియన్-2’

బహుబలి దర్శకుడు రాజమౌళి తెరక్కెకిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘బహుబలి’ లాంటి తెలుగు మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. దీంతో ఆయన తదుపరి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల తేది పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2021 జనవరి […]

‘ఆర్ఆర్ఆర్’ పోటీకి నై అంటున్న ‘ఇండియన్-2’

బహుబలి దర్శకుడు రాజమౌళి తెరక్కెకిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘బహుబలి’ లాంటి తెలుగు మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. దీంతో ఆయన తదుపరి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల తేది పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2021 జనవరి 8న రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ రిలీజ్ తేదికి విడుదల చేసేందుకు సన్నహాలు చేసిన దర్శక, నిర్మాతలు ఇప్పుడు వెనుకడు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్ర వాళ్ళు : రాజకీయాలు, సినిమాలు

విశ్వనటుడు కమలహాన్ తాజా చిత్రం ‘ఇండియన్-2’. భారతీయుడు మూవీకి సిక్వెల్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సంక్రాంతి ముందు వస్తుండటంతో ‘ఇండియన్-2’ తాజా ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఇండియన్-2’ మూవీ తెరకెక్కుతుంది. కలెక్షన్ల పరంగా ఏమైనా తేడాలొస్తే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో చిత్రబృందం ‘ఆర్ఆర్ఆర్’ తో పోటీకి వెనుకడుగు వేస్తుంది.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఇండియన్-2’ మూవీలు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’కు దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ‘ఇండియన్-2’కు తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరు ఇండియన్ సినిమా పరంగా కొత్త రికార్డులను సృష్టించినవారే. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం ఈ మూవీని 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో 2021 సంక్రాంతి రేసులో ఉన్న ‘ఇండియన్-2’ మరో రిలీజ్ డేట్ ప్రకటించాలని భావిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తో పోటీకి దిగితే రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. ‘ఇండియన్-2’ ఎలాగో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి రావడం ఏమాత్రం మంచిదికాదని గ్రహించినట్లు ఉన్నారు. దీంతో ‘ఇండియన్-2’ మరో తేదిని త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.

Tags

    follow us