‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదేనంటా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు, ఈ మూవీ టైటిల్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ గా ‘రఘుపతి రాఘవ రాజారాం’ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ […]

  • Written By: Neelambaram
  • Published On:
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదేనంటా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు, ఈ మూవీ టైటిల్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ గా ‘రఘుపతి రాఘవ రాజారాం’ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి ఈ టైటిల్‌ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారాంట. ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా  ఫస్ట్‌ లుక్‌లను మార్చి 27, మే 20 తేదీల్లో చరణ్‌, తారక్‌ల పుట్టిన రోజున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఓలియా ఈ మూవీ లో కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సీనియర్ నటి శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. భారీ పీరియాడిక్ విజువల్ వండర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. వీఎఫ్‌ఎక్స్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు