RRR Oscor : మన తెలుగు సినిమా అంటే నార్త్ ఇండియన్స్ ఒకప్పుడు ఎంత చిన్న చూపు చూసేవారో మనకి తెలియనిది కాదు..ఒకప్పుడు చిన్న చూపు చూసేవారు..ఇప్పుడు అసూయ తో చూస్తున్నారు..అందుకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న #RRR సినిమాని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కి మాత్రం ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ నుండి పంపలేదు..#RRR చిత్రాన్ని కాదని ‘చెల్లో షో’ అనే గుజారితి సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి ఫిలిం ఫెడరేషన్ ద్వారా పంపించింది మన భారత్ సర్కార్.
అందుకు కారణం కూడా లేకపోలేదు..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఊరు గుజరాత్..ఆయన స్వస్థలం నుండి తెరకెక్కిన సినిమా కావడం తో అసలు థియేటర్స్ లో విడుదల అయ్యిందో లేదో కూడా తెలియని ఒక సినిమాని అకాడమీ అవార్డ్స్ కి పంపడం నిజంగా బాధాకరం..పోనీ ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్స్ వాళ్ళు నామినేట్ చేసారా అంటే అది కూడా లేదు.
అదే ప్రభుత్వం తరుపున #RRR సినిమాని నామినేషన్స్ కి పంపించి ఉంటే ‘ఉత్తమ ఫారిన్ చిత్రం’ మరియు ‘ఉత్తమ దర్శకుడు’ క్యాటగిరీలలో చోటు దక్కేది..కేవలం ప్రభుత్వం చూపించిన పక్షపాత బుద్ధివల్లే ఈరోజు ఆస్కార్స్ లో రెండు నామినేషన్స్ చేతులారా పోయిందని అభిమానులు బాధపడుతున్నారు..#RRR స్థానం లో బాలీవుడ్ చిత్రం ఉండుంటే ఇలాగే చేసేవారా?, #RRR అనేది తెలుగు సినిమా కాదు.
పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రజాధారణ పొందిన చిత్రం..మన ఇండియన్ సినిమా అని అనుకోని ఉండుంటే ఈరోజు ‘నాటు నాటు’ సాంగ్ వల్ల దక్కిన గౌరవం కంటే పండింతులు ఎక్కువ గౌరవం దక్కి ఉండేది..ఇక నుండి అయినా ఇండియన్ గవర్నమెంట్ మన తెలుగు సినిమాని తక్కువ చేసి చూడదని ఆశిస్తున్నాము.