భారీ ధరకు అమ్ముడైన ‘ఆర్ఆర్ఆర్’

  • Written By:
  • Updated On - March 7, 2020 / 11:31 AM IST

దర్శక దిగ్గజం రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘బహుబలి’ సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ‘బహుబలి’ సృష్టించిన కలెక్షన్ల దాటేలా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగాణంతో ఈ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తేదిని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తాజాగా సీడెడ్ ప్రాంతంలో భారీ ధర పలికినట్లు సమాచారం. ఈ చిత్రానికి సీడెడ్లో 35 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఓ చిత్రానికి భారీ మొత్తం పలుకడం తొలిసారట. ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

భారీ పీరియాడిక్ విజువల్ వండర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. రాంచరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఓలియా నటిస్తుంది. కీలక పాత్రలో సీనియర్ నటి శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఖర్చుకు ఏమాత్రం వెనుకడకుండా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెల్సింది. ఒక్క సీడెడ్లోనే రూ.35కోట్ల ధర లభిస్తే ఇక వరల్డ్ వైజ్ గా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ‘బహుబలి’ సినిమాలను మించేలా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బిజినెస్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది.