Rohit Sharma: తల్లిదండ్రులను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వైరల్ వీడియో

ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంది.కొంతమంది ఒక స్టేటస్ వచ్చిన తర్వాత సొంత ఫ్యామిలీని కూడా మర్చిపోతూ ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోయి ఈ స్టార్ స్టేటస్ ను చూసి మురిసిపోతూ ఉంటారు కానీ మనం ఏ స్టేజి నుంచి వచ్చామో ఆ స్టేజ్ ని గుర్తు పెట్టుకోవాలి.

  • Written By: Gopi
  • Published On:
Rohit Sharma: తల్లిదండ్రులను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇండియన్ క్రికెట్ చరిత్రలో చాలామంది దిగ్గజ ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్ టీం కి తమవంతు సేవలు అందించారు. అందులో ముఖ్యం గా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ , రాహుల్ ద్రావిడ్ , అజారుద్దీన్ ,కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని లాంటివాళ్ళు ముందు వరుసలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ టీం ని ముందుండి నడిపించారు. ప్రస్తుతం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా వరుస విజయాలను అందుకుంటూ బెస్ట్ కెప్టెన్ గా తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అలాగే వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి తన ఒక సరికొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఇక ఇటు బ్యాటింగ్ లోనూ,అటు కెప్టెన్సీలోని తనదైన సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నాడు. రోహిత్ శర్మ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ నేను ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా నా ప్రతి విజయానికి మూల కారణం మా అమ్మ నాన్న అని చెప్పాడు. అలాగే మా నాన్న నా హీరో అని చెప్పాడు.మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మన మూలాలాను మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే దానికి మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే నాకు ఎంత మంచి సక్సెస్ వచ్చినా ఎంత మంది నా జీవితం లోకి వచ్చిన, ఎంతమంది నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినా ఎప్పటికీ మా నాన్నే నాకు హీరో అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు…

ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంది.కొంతమంది ఒక స్టేటస్ వచ్చిన తర్వాత సొంత ఫ్యామిలీని కూడా మర్చిపోతూ ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోయి ఈ స్టార్ స్టేటస్ ను చూసి మురిసిపోతూ ఉంటారు కానీ మనం ఏ స్టేజి నుంచి వచ్చామో ఆ స్టేజ్ ని గుర్తు పెట్టుకోవాలి.

ప్రస్తుతం ఉన్న నా స్టేటస్ ని అనుభవించాలి.అంతే తప్ప మన ఉన్న జీవితంలో బ్యాడ్ డేస్ మర్చిపోయి మన విజయానికి సహకరించిన వాళ్ళని మర్చిపోయి ఎప్పుడు కూడా మనమే గ్రేట్ అనే సిచువేషన్ లో ఉండకూడదు. అలా ఉన్నాము అంటే మనల్ని మించిన మూర్ఖులు ఇంకొకరు ఉండరు… రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒక ఇండియన్ టీం కెప్టెన్ అయినా కూడా తనకు ఏమాత్రం గర్వం లేకుండా డౌట్ టు ఎర్త్ ఉంటున్నాడు అంటూ ఆయన అభిమానులు కూడా సంతోష పడుతున్నారు.ఇక వీళ్లతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం రోహిత్ శర్మ ని మెచ్చుకుంటున్నా..

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు