Sunil Gavaskar: ధోని అయితే అలా.. రోహిత్ అయితే ఇలానా.? ఏంటి వివక్ష.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు ట్రోఫీ గెలిచిన ప్రతిసారి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యంత ప్రతిభ కలిగిన కెప్టెన్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని కూడా నాలుగు సార్లు మాత్రమే ట్రోఫీ గెలిచాడు.

  • Written By: BS Naidu
  • Published On:
Sunil Gavaskar: ధోని అయితే అలా.. రోహిత్ అయితే ఇలానా.? ఏంటి వివక్ష.?

Sunil Gavaskar: టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఆటగాడిగానే కాకుండా సారథిగాను మంచి రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ లో అయితే ఎవరికి సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పాడు రోహిత్ శర్మ. జట్టుకు కెప్టన్ గా ఐదు సార్లు కప్ అందించాడు. ఒక విధంగా చెప్పాలంటే ధోనితో సమానంగా సారధ్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఆటగాడిగా చూసుకుంటే ధోని కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన వ్యూహాలను అమలు చేస్తున్నాడు. అయితే ధోనీకి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రోహిత్ శర్మకు రాలేదు అన్నది ఎక్కువ మంది భావన. అదే భావనను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ వ్యక్తం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు ట్రోఫీ గెలిచిన ప్రతిసారి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యంత ప్రతిభ కలిగిన కెప్టెన్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని కూడా నాలుగు సార్లు మాత్రమే ట్రోఫీ గెలిచాడు. ధోని కంటే ఒక ట్రోఫీ ఎక్కువగానే గెలిచాడు రోహిత్ శర్మ. అయితే, ధోని కంటే ఆటగాడిగాను అద్భుత ప్రదర్శన చేసే రోహిత్ శర్మ.. ఎందుకోగాని ఆ స్థాయిలో పేరు సంపాదించుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని భారత జట్టు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్.. ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఏమంటే..?

చెన్నై సారధి ధోనితో పోల్చుతూ రోహిత్ శర్మ కెప్టెన్సీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనికి వచ్చినంత పేరు రోహిత్ కు రావడం లేదని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను ఆయన వెల్లడించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోతో ఆకాశ్ మద్వాల్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అతడికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సారధి రోహిత్ శర్మ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఇలాంటి విషయాల్లో చెన్నై సారధి ధోనీకి వచ్చినంత పేరు హిట్ మ్యాన్ కు వస్తుందని తాను అనుకోవడం లేదని గవాస్కర్ వెల్లడించాడు. ‘నిజానికి అతనిపై అంచనాలు పెద్దగా ఉండవు. అయితే, అతడు ముంబై జట్టుకు ఐదు టైటిల్స్ అందించాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. మద్వాల్ ఓవర్ ది వికెట్ బంతిని సంధించి ఆయుష్ బదోని వికెట్ తీశాడు. ఆ తర్వాత బంతికే లెఫ్ట్ హ్యాండర్ నికోలస్ పూరన్ వికెట్ ను రౌండ్ ద వికెట్ ద్వారా సంపాదించాడు. చాలా మంది బౌలర్లు అలా చేయరు. ఓవర్ ద వికెట్ మీదుగా బౌలింగ్ చేస్తూ తాము లైన్ అండ్ లెంగ్త్ సాధించినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినా బౌలింగ్ శైలిని మార్చుకోరు. అయితే, ఇక్కడ మద్వాల్ రౌండ్ ది వికెట్ మీదుగా అద్భుతంగా బంతిని సంధించి వికెట్ పడగొట్టాడు’ అని గవాస్కర్ వివరించాడు. ధోని సారధ్యంలో మద్వాల్ ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే క్రికెట్ ప్రపంచం అతని గురించి ఎంతో గొప్పగా చెప్పేదని, కానీ రోహిత్ విషయంలో అలా జరగదని సన్నీ అన్నాడు.

ధోని వ్యూహం అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు..

ఈ సందర్భంగా మాట్లాడిన గవాస్కర్.. ఇదే ప్రదర్శన ధోని సారధ్యంలో జరిగితే, నికోలస్ పూరన్ ను అవుట్ చేసినందుకు మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహ రచనను ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా కీర్తించేవారని గవాస్కర్ అన్నారు. కొద్దిగా ఎక్కువ చేసి చూపించే వారిని ఈ సందర్భంగా గవాస్కర్ వెల్లడించాడు. లక్నోతో మ్యాచ్ లో రోహిత్ శర్మ తన వ్యూహాలను అద్భుతంగా అమలు చేశాడని గవాస్కర్ ప్రశంసించాడు. ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వధేరాను ఇంపాక్ట్ ప్రేయర్ గా తీసుకున్నారని, తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటర్లను తీసుకోవాలని ఎవరు అనుకోరని ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. రోహిత్ మాత్రం ఇక్కడ ఇలాంటి నిర్ణయం తీసుకుని అద్భుతమైన ఫలితం సాధించాడని, దయచేసి అతనికి క్రెడిట్ ఇవ్వండి అని ఈ సందర్భంగా గవాస్కర్ కోరాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో అద్భుత విజయంతో ముంబై గుజరాత్ తో రెండో క్వాలిఫైయర్ లో శుక్రవారం తలపడనుంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా ఆ జట్టు తమ వ్యూహాలకు పదును పెడుతోంది.

సంబంధిత వార్తలు