Bigg Boss Captian Rj Surya: గీతూకు పిచ్చెక్కిందా ఏంటి? ఏంటా ప్రవర్తన.. కొత్త కెప్టెన్ గా కొండబాబు.. త్యాగశీలికి నిరాశ
Bigg Boss Captian Rj Surya: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అందరూ అభిమానిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే సూర్య ఎంపికయ్యాడు.ఇంటి సభ్యులందరూ చివరకు మిగిలిన రోహిత్, సూర్యలలో సూర్యకే ఓటేశారు. పాపం.. ఇంటికి చార్జింగ్ కోసం రెండు వారాలు నామినేట్ అయినా కూడా మంచోడన్న కనికరం లేకుండా రోహిత్ ను కెప్టెన్ గా చేయలేదు. ఆఖరుకు ఆయన భార్య అయిన మెరీనా కూడా సూర్యకే ఓటు వేయడం అవాక్కయ్యేలా చేసింది. కెప్టెన్సీ టాస్కులో ఫస్ట్ […]

Bigg Boss Captian Rj Surya: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అందరూ అభిమానిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే సూర్య ఎంపికయ్యాడు.ఇంటి సభ్యులందరూ చివరకు మిగిలిన రోహిత్, సూర్యలలో సూర్యకే ఓటేశారు. పాపం.. ఇంటికి చార్జింగ్ కోసం రెండు వారాలు నామినేట్ అయినా కూడా మంచోడన్న కనికరం లేకుండా రోహిత్ ను కెప్టెన్ గా చేయలేదు. ఆఖరుకు ఆయన భార్య అయిన మెరీనా కూడా సూర్యకే ఓటు వేయడం అవాక్కయ్యేలా చేసింది.
కెప్టెన్సీ టాస్కులో ఫస్ట్ రౌండ్ లో ఆర్జే సూర్య, ఆదిరెడ్డి, వాసంతి, రోహిత్, అర్జున్, శ్రీసత్య, రేవంత్, రాజశేఖర్ లు ఎంపికయ్యారు. వారితో గేమ్ ఆడించగా చివరకు సూర్య, రోహిత్ లు మిగిలారు. ఒకరకంగా రోహిత్ ఇంటి సభ్యులంతా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు త్యాగం చేసి రెండు వారాలు నామినేట్ అయ్యాడు. అంత త్యాగం చేసినా కూడా ఇంటిసభ్యులంతా కాస్త కూడా కనికరం చూపకుండా అతడి త్యాగాన్ని గుర్తించకుండా ఆర్జే సూర్యను కెప్టెన్ ను చేశారు. రోహిత్ కు ఇదే సింపథీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే రెండు వారాలు నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి అతడికి మంచి సపోర్టు వచ్చే అవకాశం ఉంది.
ఇక హౌస్ లో ఆరోహి వెళ్లాక ఇనాయాను తగులుకున్నాడు సూర్య. ఇప్పుడు కెప్టెన్ కావడంతో వీరి రోమాన్స్ చూడలేక హౌస్ లో జనాలు, బయట జనాలు పిచ్చెక్కిపోవాల్సిందే ఇక. మరో వారం పాటు వీరిద్దరూ ఆడింది ఆట పాడిందే పాట.. సందుబొంగుల్లో ఏం చేస్తారో చూసి తట్టుకోండయ్యా మహాశయులారా..
ఇక సూర్య కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే సమయంలో గలాట గీతూ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఆ పిల్లకు ఏమైనా పిచ్చెక్కిందా? అన్న డౌట్ రాకమానదు. ఎందుకంటే ఆమె ప్రవర్తన అంత ఘోరంగా ఉంది మరీ.. కొత్త కెప్టెన్ గా కొండబాబు (సూర్య) బాధ్యతలు చేపట్టగానే తన బయట ఉన్న లవర్ బుజ్జమ్మకు , తల్లికి , ఎలిమినేట్ అయిన వారికి ఈ విజయం అంకితం చేశాడు..
బయట బుజ్జమ్మను లవర్ గాపెట్టుకొని.. లోపల మొన్నటిదాకా ఆరోహితో.. ఇప్పుడు ఇనాయాతో రోమాన్స్ ఏంట్రా కొండ బాబు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.కానీ తనదైన మంచి ప్రవర్తనతో మన కొండబాబు హౌస్ మేట్స్ అభిమానంతోపాటు బయట జనాల అభిమానం గెలుచుకున్నాడు. ఒక్క ఇనాయాతో రోమాన్స్ చండాలం వదిలేస్తే సూర్యకు మంచి భవిష్యత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిందనే చెప్పాలి.
