Rithu Chowdhary: తండ్రి శవం మీద ప్రామిస్ చేసిన రీతూ.. ఏమని చేసింది? ఎందుకు
తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రీతూ చౌదరి షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధను గుండెల్లోనే దిగమింగుకొని నాన్న శవం పై చేసిన ప్రామిస్ గురించి చెప్పుకొచ్చింది.

Rithu Chowdhary: సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రీతూ చౌదరి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది రీతూ. ఈమె అందం, నటన, స్మైల్ తో మరింత అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇలాంటి రీతూకు కనుక మంచి ఆఫర్లు వస్తే కెరీర్ పరంగా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. కానీ సరైనా అవకాశం రావడం లేదని ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతుంటారు. ఇదిలా ఉంటే సినిమా, సీరియల్ లో నటించే వారి లైఫ్ లు చాలా బాగుంటాయి అనుకుంటారు. కానీ వారి వెనుక ఊహించలేని విషాద గాథలు ఎన్నో ఉంటాయి. రీసెంట్ గా ఇలాంటి విషయాన్ని బయటపెట్టింది రీతూ.. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా?
తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రీతూ చౌదరి షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధను గుండెల్లోనే దిగమింగుకొని నాన్న శవం పై చేసిన ప్రామిస్ గురించి చెప్పుకొచ్చింది. అయితే ఈమె తండ్రి చనిపోయే ముందురోజు చాలా యాక్టివ్ గా ఉన్నారట. అంతే కాదు రీతూను యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండాలని కోరారట. అదే విధంగా ఊరి గురించి ఒక వ్లాగ్ చేయాలని కోరారని తెలుపుతూ ఆవేదన చెందింది రీతూ. రాత్రంతా ఎన్నో విషయాల గురించి మాట్లాడిన నాన్న ఉదయం మరణించారని తెలిసి తట్టుకోలేకపోయారు అంటూ ఆమె చేసిన కామెంట్లు అభిమానులను కూడా కంటతడి పెట్టించాయి.
అయితే తన తండ్రి చివరి క్షణాలను చూడలేకపోయానని.. మొదటి జీతంతో కొన్న కారులో నాన్న శవాన్ని తీసుకుని వచ్చామని.. ఇక అందులో ఎప్పుడు ప్రయాణించినా నాన్న తనతోనే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంటుందని చెబుతూ ఆవేదన చెందింది. తన అన్నయ్య కూడా నాన్న మరణాన్ని జీర్ణించుకోలేదట. అయితే ఇవన్నీ చూసిన రీతూ తన తండ్రి శవం మీదనే కుటుంబ బాధ్యతలు తాను తీసుకుంటానని ప్రామిస్ చేసిందట. నాన్న లేని లోటు రాకుండా చూసుకుంటాను అని అనుకుందన్నమాట. మొత్తం మీద అందాల బొమ్మ రీతూ వెనుక ఇంతటి విచారకరమైన బాధ దాగి ఉంది.
