Air Pollution in Hyderabad : మనం బతికేదే గాలిని పీల్చి.. ఆ గాలి కలుషితం అయితే ఇక ఎట్లా బతికేది..? ఇప్పుడు హైదరాబాద్ లోనూ గాలి కాలుష్యంతో బతకడం దుర్భరంగా మారుతోంది. వాతావరణ మార్పులతో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లో అత్యధిక కాలుష్యం ఉండే ఢిల్లీ కంటే గాలి నాణ్యత హైదరాబాద్ లో పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Air Pollution in Hyderabad
వాతావరణంలో మార్పులతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాయుకాలుష్య ప్రభావం పెరుగుతుంది. సాధారణంగా తెలంగాణలో నవంబర్-జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి.ఈ పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండెజబ్బులు ఉన్న వారిపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?
హైదరాబాద్ లో నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలు, విస్తరిస్తున్న పరిశ్రమల నుంచి వెలువడే పొగ కారణంగా ప్రాణవాయువు విషవాయువుగా మారుతోంది. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 10) , అతిసూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5) నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి వాయువులు గాలిని కలుషితం చేస్తాయి.
మామూలు రోజుల్లో కర్బన ఉద్గారాలు గాలిలో చెల్లచెదురవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, గాలిలో తేమ ఉన్నప్పుడు మాత్రం ఇవి విడుదలైన ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోతాయి. ఫలితంగా గాలి నాణ్యత క్షీణిస్తుంది. అది పీల్చిన వాళ్లకు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
గాలి నాణ్యతారేటు 50 పాయింట్లలోపే ఉండాలి. కానీ హైదరాబాద్ లో ఈరోజు 103 పాయింట్లు ఉంది.ఇక మనతో పోల్చిచూస్తే బెంగళూరు సేఫ్ సైడ్ లో ఉంది. పెద్ద నగరమైన బెంగళూరులో 82 పాయింట్లు మాత్రమే గాలి నాణ్యత ఉంది. నగరంలో గాలిని పీల్చడం ప్రమాదకరమని.. గుండె , శ్వాసకోస వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Sarkari Vaari Paata Prabhas: సర్కార్‌వారి పాట సినిమా చూసిన ప్రభాస్.. మహేశ్ నటనపై సంచలన వ్యాఖ్యలు!!