Rishab Shetty On Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా కాదు ..కన్నడ బిడ్డ : సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రిషబ్ శెట్టి.

అసలు విషయానికి వస్తే మొదటినుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కన్నడ భాష అన్న అలానే అక్కరి అభిమానుల ఎంతో ప్రేమ. తాజాగా సైమా అవార్డ్ 2023 ఫంక్షన్‌లో మరోసారి కన్నడ భాషపై తన ప్రేమను తెలియజేశారు తారక్.

  • Written By: Vishnupriya
  • Published On:
Rishab Shetty On Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా కాదు ..కన్నడ బిడ్డ : సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రిషబ్ శెట్టి.

Rishab Shetty On Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగులో ఎంతమంది అభిమానులు ఉన్నారో దాదాపు అంతే క్రేజ్ ఆయనకి మొదటినుంచి కన్నడలో కూడా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఈ సినిమా కన్నా ముందు నుంచే ఎన్టీఆర్ కి కన్నడలు అభిమానులు ఉండేవారు. అంతేకాదు ఎన్టీఆర్ తరచుగా కర్ణాటకలో జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య సైమా అవార్డుల్లో కాంతారా హీరో రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే మొదటినుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కన్నడ భాష అన్న అలానే అక్కరి అభిమానుల ఎంతో ప్రేమ. తాజాగా సైమా అవార్డ్ 2023 ఫంక్షన్‌లో మరోసారి కన్నడ భాషపై తన ప్రేమను తెలియజేశారు తారక్. ఈ సందర్భంగా కాంతార హీరో రిషభ్ శెట్టి-ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఈ అవార్డుల్లో హీరో రిషభ్ శెట్టి-తారక్ కలిశారు. ఈ సందర్భంగా రిషభ్ తనకు దక్కిన అవార్డును తీసుకున్న తర్వాత ఎన్టీఆర్‌తో స్టేజ్‌పై నుంచే మాట్లాడారు. ఎలా ఉన్నారు సార్ అని ఎన్టీఆర్‌ని అడిగారు రిషభ్. దీనికి కన్నడలోనే బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు అని ఎన్టీఆర్ అడిగారు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. సార్ మీరు కుందాపూర్ (కర్ణాటక) వచ్చినప్పుడు కూడా కన్నడలోనే మాట్లాడతారా అని అడిగితే మా అమ్మతో నేను కన్నడలోనే మాట్లాడతాను అని ఎన్టీఆర్ బదులిచ్చారు. దీంతో ఎన్టీఆర్‌పై రిషభ్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

“నేను మీకు డైరెక్ట్‌గా థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ దొరకలేదు. లాస్ట్ టైమ్ కిరాక్ పార్టీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మీరే ఇచ్చారు.. అప్పటి నుంచి మాకు అనిపించేది ఒక్కటే మీ అమ్మగారి ఊరు.. మాది ఒకటే ఊరు.. అందు మీరు ఆంధ్ర వ్యక్తి అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు.. ” అంటూ రిషభ్ అన్నారు.

ఇక ఈ వీడియోని ఎన్టీఆర్ అభిమానులు అలానే కన్నడ సినిమా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు