Rishab Shetty Kantara: కేజీఎఫ్ తరువాత కన్నడ నుంచి వచ్చిన మరో మూవీ ‘కాంతార’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం హిందీలోనూ ‘కాంతార’ లోకల్ సినిమాలను బీట్ చేస్తోంది. కన్నడలో ఇప్పటికే 100 కోట్లు దాటిన ‘కాంతార’ తెలుగులో ఇప్పటి వరకు రూ.25 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. హిందీలో రిలీజైన మొదటి రోజే రూ.1.9 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.దీంతో రాను రాను ‘కాంతార’ ఇండియా లెవల్లో రికార్డు వసూళ్లు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను తీసిన డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి భార్య, కూతురు కూడా సినిమాలో నటించారు..వారు ఏయే పాత్రలో నటించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.
rishab shetty family
కాంతార’ సినిమాలో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. తన ఊర్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా స్టోరీ బయటి వాళ్లకు అద్భుతంగా చూపించడంతో రిషబ్ శెట్టి ఒక్క సినిమాతోనే పాపురల్ అయ్యారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు కొందరు ఇతర ఇండస్ట్రీల నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటీవల తెలుగులో ఓ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అడిగిన వెంటనే రిషబ్ ఒప్పుకున్నట్లు తెలిసింది.
అసలు విషయానికొస్తే ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేశారు. అయితే ఆయన సతీమణి ప్రగతి శెట్టి, కూతురు రాధ్య కూడా నటించారు. సినిమా ప్రారంభంలో రాజు తిరిగి వస్తున్నప్పుడు ఓ మహిళ ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ మహిళ క్యారెక్టర్లో నటించింది ప్రగతి శెట్టినే. అలాగే రిషబ్ శెట్టి కూతురుకు సంబంధించిన ఓ సీన్ కూడా ఉంటుంది. సినిమా ప్రారంభంలో ఓ ఉయ్యాలలో పాప కనిపిస్తుంది. ఆ పాప ఎవరో కాదు రిషబ్ శెట్టి కూతురు రాధ్య. ఇప్పుడీ న్యూస్ వైరల్ అవుతోంది.
rishab shetty family
ప్రతీ ఇండస్ట్రీలో ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రభావం ఇతర సినిమాలపై తీవ్రంగా పడిందని ఇండస్ట్రీ లెవల్లో చర్చించుకుంటున్నారు. ‘కాంతార’కు భయపడి కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు రావడంతో రిషభ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. దీంతో రిషభ్ శెట్టి నెక్ట్స్ మూవీ ఎలా తీస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.