చెన్నకేశవుల భార్యకు అండగా నిలుస్తున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెన్నకేశవుల భార్య రేణుకు అండగా నిలుస్తాడు. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు(దిశ)పై జరిగిన అమానుష ఘటన సంచనలం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తాయి. దిశ కేసులో ప్రధాన నిందితుల్లో చెన్నకేశవులు ఒకరు. తాజాగా చెన్నకేశవుల భార్య రేణుక గత రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చింది. దీనిపై రాంగోపాల్ వర్శ తన ట్వీటర్లో స్పందించాడు. తోడులేకుండా జీవిస్తున్న వారికి ప్రతీఒక్కరు అండగా ఉండాలని రాంగోపాల్ వర్మ కోరాడు. రేపిస్టుల […]

  • Written By: Neelambaram
  • Published On:
చెన్నకేశవుల భార్యకు అండగా నిలుస్తున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెన్నకేశవుల భార్య రేణుకు అండగా నిలుస్తాడు. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు(దిశ)పై జరిగిన అమానుష ఘటన సంచనలం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తాయి. దిశ కేసులో ప్రధాన నిందితుల్లో చెన్నకేశవులు ఒకరు. తాజాగా చెన్నకేశవుల భార్య రేణుక గత రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చింది. దీనిపై రాంగోపాల్ వర్శ తన ట్వీటర్లో స్పందించాడు.

తోడులేకుండా జీవిస్తున్న వారికి ప్రతీఒక్కరు అండగా ఉండాలని రాంగోపాల్ వర్మ కోరాడు. రేపిస్టుల నీడ వారిపై పడకుండా వారి భవిష్యత్ బాగుండాలంటే దయచేసి వారికి సాయమందించాలని రాంగోపాల్ వర్శ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్(ఎఎస్ఎ) అకౌంట్ నెంబర్, బ్యాంక్ IFSC కోడ్ తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

‘దిశ’ సంఘటనపై రాంగోపాల్ వర్శ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మృగాళ్లు భయపడేలా సినిమా తీస్తానని ఇప్పటికే ఆయన ఇప్పటికే ప్రకటించాడు. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నకేశవుల భార్యను తన ఛాంబర్ కు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు కొంతమేర ఆర్థికసాయం కూడా అందించారు. అలాగే దిశ కేసును ఛాలెంజ్ గా తీసుకొని నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులతో మాట్లాడి కథను సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాంగోపాల్ వర్శ సన్నహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు