RGV: సోషల్ మీడియాలో ఆర్జీవి సంచలనం.. ఈసారి జగన్ టార్గెట్
రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడే కాదు.. ఇటీవల రాజకీయ వివాదాలకు సైతం కారణమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు.

RGV: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. జగన్కు మద్దతుగా నిలవడంలో ఆర్జీవి ముందుంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. విశాఖలో పాలనను విజయదశమి నుంచి ప్రారంభించనున్నట్లు జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రెండు రోజుల కిందటే టిడిపి పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఆర్జీవి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఓ విద్యార్థి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కావాలనే టీడీపీ నేతలు చేయించారని ఆర్జీవి తప్పుపట్టారు. చదువుకునే చిన్నపిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడే కాదు.. ఇటీవల రాజకీయ వివాదాలకు సైతం కారణమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. సీఎం జగన్ కు మద్దతుగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది బయోపిక్ కాదు.. రియల్ పిక్చర్ అంటూ ఆర్జీవి సంకేతాలు ఇస్తున్నారు. తరచూ సీఎం జగన్ ను కలవడంతో పాటు వ్యూహం సినిమాను తెరకెక్కించడంలో ఆర్జీవి బిజీగా ఉన్నారు. ఖాళీ సమయాల్లో ఆయన చేస్తున్న రాజకీయ పోస్టులు సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తామని సీఎం జగన్ ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి పాలన అదిగో ఇదిగో అంటూ చెప్పుకొచ్చిన జగన్ విజయదశమినే ముహూర్తం గా పెట్టుకున్నారు. అయితే దీనిపై పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ విశాఖ వాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఇల్యూషన్ టూల్ ను ఉపయోగించి విశాఖ బీచ్, కొండలను కలిపి జగన్ ఫేస్ వచ్చేలా ఫోటోలు క్రియేట్ చేశారు. ఆ ఫోటోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలని కోరారు. దీనికి వైసిపి శ్రేణులు ఆనందంతో రియాక్ట్ అవుతున్నారు. విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
