హీరోలపై ఆర్జీవీ ‘కరోనా’ పంచ్

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ సినీ ప్రముఖులు పలురకాలుగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ తెలంగాణలో సోకిందని ప్రచారం కాగానే హీరోయిన్ […]

  • Written By: Neelambaram
  • Published On:
హీరోలపై ఆర్జీవీ ‘కరోనా’ పంచ్

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ సినీ ప్రముఖులు పలురకాలుగా స్పందిస్తున్నారు.

కరోనా వైరస్ తెలంగాణలో సోకిందని ప్రచారం కాగానే హీరోయిన్ ఛార్మి వెల్ కమ్ చేస్తూ వీడియో పోస్టుచేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఛార్మిని నెటిజన్లు ట్రోలింగ్ చేయడంతో వీడియోను డిలీట్ చేసి అందరికి క్షమాపణ చెప్పింది. అందరినీ భయపెడుతున్న కరోనా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టార్గెట్ చేయడంతో నెటిజన్లు అవాక్కాయ్యారు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ బతికించు. అంటూ కరోనాకు జ్ఞానోదయం చేశాడు.

తాజాగా రాంగోపాల్ వర్శ హీరోలపై తనదైన శైలిలో సెటైర్ వేసి ఆకట్టుకున్నాడు. విలన్లను భయపెట్టే హీరోలు ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోకుండా ఎక్కడికి పోయారంటూ ట్వీట్ చేశాడు. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ మొదలైన హీరోలందరూ ఎక్కడ ఉన్నారు. వారు వేరే గ్రహానికి పారిపోయారని మాత్రం చెప్పకండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు