RFCL Recruitment 2021: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 16 వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ కావడం గమనార్హం. ఈ నెల 22వ తేదీతో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 16 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, మెకానికల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్), సివిల్ మేనేజర్, ఐటీ డిప్యూటీ మేనేజర్, ఐటీ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఇతర ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఏ లేదా సీఎంఏ లేదా ఎంబీఏ పాసైన వాళ్లు అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన వాళ్లు సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వాళ్లు మెటీరియల్స్ మేనేజర్ పోస్టుకు, ఎంబీఏ చేసిన వాళ్లు హెచ్‌ఆర్ మేనేజర్ అనే పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో వేగంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://nationalfertilizers.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.