Revanth Reddy : అడ్డా కూలీలు.. బీర్లు బిర్యానీలు తిని మొరిగేటోళ్లు.. ఉస్మానియా విద్యార్థులపై నోరుపారేసుకున్న రేవంత్
యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌గాంధీని అడ్డుకుంటామన్న ఓయూ విద్యార్థులను అడ్డా మీది కూలీలతో పోల్చారు.

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపుస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొదటి విడత ప్రచారం పూర్తిచేసుకుని రెండో విడత ప్రచారంలో రోజుకు మూడు సభలతో దూసుకుపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రచారం జోరు పెంచాయి. కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు వస్తున్నారు. మొన్న ఏఐసీసీ అధినేత మల్లికార్జునఖర్గే ప్రచారం చేయగా, నిన్న రాహుల్‌గాంధీ పాలమూరులో ప్రచారం చేశారు. ఆరు గ్యాంరెంటీ స్కీంలతోపాటు పలు వరాలు కురిపించారు. రాహుల్. అయితే రాహుల్ రాకను ఉస్మానియా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం హైదరబాద్‌లో రాహుల్ రోడ్‌షో ఉండగా అడ్డుకుంటామని విద్యార్థులు ప్రకటించారు.
విద్యార్థులను అడ్డా కూలీలన్న రేవంత్..
ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాం్రVð స్ ఈసారి ఎలాగౌనా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ క్రమంలో నేతలు చిన్న చిన్న పొరపాట్లతో పార్టీకి ఇబ్బందులు తెస్తున్నారు. మొన్న పరిగి సభలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌ను ఏకంగా సీఎంగా ప్రకటించి పార్టీ సీనియర్లలో అసంతృప్తికి కారణమయ్యారు. ఈ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏకంగా టీపీసీసీ చీఫే ఓయు విద్యార్థులపై అణుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌గాంధీని అడ్డుకుంటామన్న ఓయూ విద్యార్థులను అడ్డా మీది కూలీలతో పోల్చారు.
కేటీఆర్ చిల్లరకు ఆశపడి..
రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వేసే చిల్లర డబ్బులకు ఆశపడి కొంతమంది విద్యార్థులు రాహుల్ పర్యటనను అడ్డుకుంటామంటున్నారని ఆరోపించారు. చిల్లర డబ్బులతో బీర్లు తాగి, బిర్యానీ తిని, అది అరిగే వరకు రాహుల్ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోను బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఎన్నికల వేళ ఇబ్బందిగా..
రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ ఆ పార్టీకి ఇబ్బందిగా మారతాయని విశ్లేషకులు అంటున్నారు. ఇంటర్వ్యూలో ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు సహనం కోల్పోవద్దని సూచిస్తున్నారు. రాహుల్‌ను మహా అయితే పది ఇరవవై మంది అడ్డుకునేవారేమో కానీ, రేవంత్ వీడియో చూసిన తర్వాత వీరి సంఖ్యవందల్లో ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై ఓయూ విద్యార్థులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు కించపర్చేలా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పొరపాట్లు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీర్లు, బిర్యానీలు తిని.. తిన్నది అరిగే దాకా మాట్లాడే అడ్డా మీద కూలీ లాంటోల్లు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి pic.twitter.com/PQi1MT7OcQ
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2023
