Revanth Reddy : కాంగ్రెస్ గెలిస్తే సీతక్కనే సీఎం.. సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం అభ్యర్థిగా సీతక్క పేరు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ బీఆర్ఎస్ కు కూడా షాకిచ్చింది. ఎందుకంటే సీఎం పదవిని కేసీఆర్ లేకపోతే కేటీఆర్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy : కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు.. కలహాలు.. అదొక మహాసముద్రం.. అందరికీ విచ్చలవిడిగా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ కోసం పనిచేయవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారైతే బీజేపీలో ఉన్న తన తమ్ముడి గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ కు జోష్ వచ్చింది. తెలంగాణపై ఆశలు పుట్టాయి. అయితే మొత్తం రెడ్డి రాజ్యంగా ఉన్న కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి అందరూ సీఎం సీటు కోసం పడుతున్నారు. సీఎం అభ్యర్థిపై ఎవరికి వారు సొంతంగా తామంటే తాము అని ప్రచారం చేసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తనను తాను పోటీదారుడిగా ప్రకటించకుండా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీపైనే పడింది.
-సీతక్క పేరు సూచించడంలో..
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం అభ్యర్థిగా సీతక్క పేరు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ బీఆర్ఎస్ కు కూడా షాకిచ్చింది. ఎందుకంటే సీఎం పదవిని కేసీఆర్ లేకపోతే కేటీఆర్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీతక్క పేరు చెప్పడంతో బీఆర్ఎస్, బీజేపీ కూడా మహిళల పేర్లు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అవి ఆ సాహసం చేయవు. దీంతో ఇరకాటంలో పడినట్లు అవుతుంది.
-తానా సభల్లో ..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరు తానా సభలకు హాజరయ్యారు. అక్కడ ఓ ఎన్ఆర్ఐ రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా సీతక్క అని సమాధానం ఇచ్చారు. దీంతో మిగతా పార్టీలను చిక్కుల్లో పెట్టారు. వారిని కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు సీఎం అభ్యర్థి మీదే రాజకీయం తిరుగుతుంది.
-అధిష్టానం ఒప్పుకుంటుందా?
సీఎం అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమా? పార్టీ ప్రకటన అనేది తెలియడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకరి మాట చెల్లదు. దానికి అందరి సమ్మతం కావాలి. అధిష్టానం ఒప్పుకోవాలి. అప్పుడే నిర్ణయం జరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రకటన ఆచరణకు నోచుకుంటుందా? లేక మధ్యలోనే మాసిపోతుందా అనేది తేలాల్సి ఉంది.
