ఆ విషయంపై రేవంత్ రెడ్డి అరెస్ట్

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ ఫాంహౌస్‌ పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ […]

  • Written By: Neelambaram
  • Published On:
ఆ విషయంపై రేవంత్ రెడ్డి అరెస్ట్


మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

కేటీఆర్ ఫాంహౌస్‌ పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే వీటిని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో… ఆయనను అరెస్ట్ చేశారు. ఆరు పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్‌ ను కూడా ఫైల్ చేసినట్టు సమాచారం.

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత వార్తలు