Republic Day 2023 : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలోనూ నేతలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాయి.
ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు , జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan
గారు#RepublicDay#RepublicDay2023Live Link: https://t.co/aeziqqgwX6 pic.twitter.com/1i8BgzKKa8
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2023
రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న తరుణంలో, నేటికీ రాజ్యాంగ ఫలాలు నోచుకోని ప్రజలకు అందేలా శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థలు పారదర్శకంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు పవన్ కళ్యాణ్.
భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్!#RepublicDay
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2023
ఇక చంద్రబాబు కూడా జెండా ఎగురవేసి భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్! అంటూ ట్వీట్ చేశారు.