‘Reliance’ Hotels : ‘రిలయన్స్’ హోటళ్లు వెనుక కథేంటి?
ఆతిథ్య రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఐటీసీ, టాటా గ్రూప్ ఇండియన్ హోటళ్లకు పోటీ ఇస్తోంది.

‘Reliance’ Hotels : భారత అపర కుభేరుడు ముఖేస్ అంబానీ రకరకాల పరిశ్రమలు స్థాపించి సక్సెస్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికై పెట్రోల్, టెలికాం, రిటైల్ రంగంలో విజేతగా నిలిచారు. ఇప్పుడు ఆతిథ్య రంగంలో రాణించాలని తాపత్రయపడుతున్నాడు. ఇందులో భాగంగా హోటళ్లు నిర్వహించడానికి ముందడుగు వేశారు. ప్రముఖ హోటల్ ది ఒబేరాయ్ తో కలిసి నడిపించడానికి అవగాహన ఒప్పందాన్ని ఇటీవల చేసుకున్నారు. దీంతో రిలయన్స్ అధినేత ఇక నుంచి హోటళ్ల రంగంలోనూ తన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది.
ఇప్పటికే ముఖేష్ అంబానీ నేతృత్వం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో అనంత విలాస్ హోటల్, యూకే లోని ఐకానిక్ స్టోక్ పార్క్, గుజరాత్ లో మరో ప్రాజెక్టుకుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఒబేరాయ్ నడుపుతున్న ఐకానిక్ లగ్జరీ విలాస్ పోర్ట్ పోలియోలో భాగంగా అనంత్ విలాస్ మొదటి మెట్రో ప్రాపర్టీగా భావిస్తుందని రిలయన్ష్ ఇండస్ట్రీ లిమిటెడ్ తెలిపింది. ఇది గెస్ట్ హౌస్ నిర్వహణతో పాటు కళలు, సంస్కృతి, విద్యా, సందర్శకులతో రద్దీగా మారుతంది. ఇప్పుడు హోటల్ నిర్వహణకు కూడా ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుందని ‘రిల్’ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్యమివ్వడంలో ఒబెరాయ్ ప్రసిద్ధి చెందింది. దీనికి అసమానమైన రికార్డు ఉంది. ఒబెరాయక్ కి అనేక ప్యాలెస్ లు, చారిత్రాత్మక ఆస్తులు కూడా కలిగి ఉన్ానయి. 2022లో ప్రపంచంలోని ఉత్త హోటల్స్ లో ఒబెరాయ్ బ్రాండ్ గా ఎంపికైంది. ఇప్పుడు ఒబేరాయ్ తో ప్రపంచస్థాయి వ్యక్తులకు అతిథ్యమివ్వడానికి రిలయన్స్ ముందుకు సాగుతోంది. గోల్ఫ్, ఇతర క్రీడా సౌకర్యాలతో సహా స్టోక్ పార్క్ గా అప్ గ్రేడ్ చేసి హోటల్స్ ను రూపుదిద్దనున్నారు. అయితే ఒబేరాయ్ తో కలిసి చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టలేదని ముఖేష్ అంబానీ తెలిపారు.
ఆతిథ్య రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఐటీసీ, టాటా గ్రూప్ ఇండియన్ హోటళ్లకు పోటీ ఇస్తోంది. గత సంవత్సరం మాండరిన్ ఓరియంటల్ హోటల్ లో 73 శాతం వాటాను దాదాపు 100 మిలియన్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ప్రముఖ ఒబెరాయ్ తో కలిసి నడవడం ఆసక్తిగా మారిందని అంటున్నారు.
