Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్ అనంతరం అతి చిన్న వయసులోనే హీరోగా అవకాశాలను దక్కించుకున్నారు. ఇలా చిన్నవయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలతో పాటు ఎన్నో చిత్రాలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో తన కెరీర్ గురించి తనకు ఎంతో ఆందోళన వేసిందని మరి తిరిగి మొదటికే వచ్చానన్న భావన తనలో కలిగిందని తారక్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
17 సంహీరోగా ఎంట్రీ ఇచ్చిన తారk తన 18వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టానని తెలిపారు. ఆతర్వాత సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా వరుస ఫ్లాపులు అవుతున్న సమయంలో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లానని నటుడిగా తనలో ఒక కన్ఫ్యూషన్ మొదలైందని తెలిపారు.
Also Read: త్రివిక్రమ్ బడ్జెట్ పై మహేష్ ఆంక్షలు !
డిప్రెషన్, కన్ఫ్యూషన్ లో ఉన్న తనకు రాజమౌళి ఎంతో సహాయం చేశారని తారక్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళి సహాయంతో నటుడిగా నేను నన్ను ఆత్మపరిశీలన చేసుకున్నాను. అప్పటి నుంచి తన కెరియర్ మారిపోయిందని,ఇలా తన కెరీర్ మారిన నటుడిగా నాకు సంతృప్తి కలగలేదని, ప్రస్తుతం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Also Read: ‘అఖండ’ కలెక్షన్ల ప్రభంజనం ఆగట్లేదు !