చిరంజీవి కాకుండా మరొకరైతే చేసేది కాదట…

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 152వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “ఆచార్య” అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో దానిలో రెజీనా ఈమధ్య ఆడి పాడింది. దాదాపుగా ఆరు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ పాటకు సంబంధించి రెజీనా మాట్లాడుతూ చిరంజీవి గారు కాబట్టే తాను స్పెషల్ సాంగ్ చేసానని, చిరంజీవితో అవకాశం రావడం అంటే దానిని తాను ఎలా […]

  • Written By: Raghava
  • Published On:
చిరంజీవి కాకుండా మరొకరైతే చేసేది కాదట…

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 152వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “ఆచార్య” అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో దానిలో రెజీనా ఈమధ్య ఆడి పాడింది. దాదాపుగా ఆరు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ పాటకు సంబంధించి రెజీనా మాట్లాడుతూ చిరంజీవి గారు కాబట్టే తాను స్పెషల్ సాంగ్ చేసానని, చిరంజీవితో అవకాశం రావడం అంటే దానిని తాను ఎలా వదులుకుంటానని, తనకు డాన్స్ అంటే ఇష్టమని చిరంజీవి గారి డాన్స్ చూసి తాను చాలా నేర్చుకున్నానని, నా డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి చిరంజీవి గారు పొగడటం కూడా జరిగిందని ముచ్చట్లు చెబుతుంది.

దయచేసి ఈ సాంగ్ ను స్పెషల్ సాంగ్ లా చూడవద్దని, దీనిని సెలబ్రేషన్ సాంగ్ అనాలని కొత్త అర్ధాలు చెబుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ముందుగా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించవలసి ఉన్నా ఇప్పుడు అతడి ప్లేస్ లో మహేష్ బాబు మెరవనున్నాడు. దాదాపుగా మహేష్ బాబు 30 నిమిషాల పాటు కనపడనున్నాడు. ఈ సినిమాను వచ్చే దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత వార్తలు