Pawan Kalyan farmhouse: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజంలో ఎంతో ప్రభావితం చేసే రెండు క్రియాశీల రంగాల్లో ఉన్నారు. ఒకటి సినిమా రంగం.. రెండోది రాజకీయ రణరంగం.. ఈ రెండూ మీడియాకు ప్రధాన వనరులు. అందుకే ఆయన గురించి చీమ చిటుక్కుమన్నా కూడా అది వైరల్ అవుతుంటుంది. నిప్పు లేకున్నా పొగ రాజేసే ఘనులు మన మీడియాలో ఉన్నారు. ముఖ్యంగా జగన్ తో వైరం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గురించి సందు దొరికితే చాలు మూసేయాలంత కసిగా ప్రత్యర్థులు ఉన్నాడు.
నాడు అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఇలాగే నాశనం చేసేశారు. ఓ పక్క రెడ్డి ‘రాజశేఖర్ రెడ్డి’.. ‘కమ్మ’ చంద్రబాబులు కలిసి ‘ప్రజారాజ్యం’ కాపుల పార్టీలో నేతల ఎగదోసి రచ్చ చేసి మీడియాకు ఎక్కి అభాసుపాలు చేసి.. ప్రజల్లో చులకన చేసి ఆ పార్టీని దెబ్బతీశారు.ఇప్పుడు ‘జనసేన’పై అదే ప్రయోగిస్తున్నా.. మన మొండి పవన్ కళ్యాణ్ మాత్రం వీటన్నింటిని తట్టుకుంటూ బలంగా నిలబడుతున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త ఫాంహౌస్ కొన్నాడని.. అందులో ఇంద్రభవనం లాంటి భవంతిని కడుతున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వైసీపీ, దాని అనుకూల మీడియా అయితే పవన్ కళ్యాణ్ లగ్జరీ జీవితం గడుపుతున్నారని పుంకానుపుంఖాలుగా కథనాలు వండి వారుస్తున్నాయి.
నిజానికి ‘పవన్ కళ్యాణ్’ కొత్త ఫాంహౌస్ కొనలేదు. అందులో ఇంద్రభవనం కట్టలేదు. అసలు జరిగింది వేరు. పవన్ కు ప్రకృతిపై మమకారం ఎక్కువ. రైతులాగా జీవించాలని.. వ్యవసాయం చేయాలని ఆయనకు అభిలాష. సాధారణ జీవితం గడపాలని మిద్దెలు, రాచమర్యాదలు వద్దన్నది పవన్ అభిప్రాయం. సింప్లిసిటీగా ఉండడం పవన్ కు ఇష్టం.
అందుకే చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ శివారులో 16 ఎకరాల భూమి కొని అందులో వ్యవసాయం చేస్తున్నారు. అందులోనే ఆవులు, గేదెలు పెంచుతూ ఆ ఫాంహౌస్ లోనే షూటింగ్ లేని టైంలో కాలం గడుపుతారు. సాధారణ రైతులా వ్యవసాయం చేస్తుంటాడు. ఇక అక్కడ ఉండేందుకోసం ఓ చిన్న పాటి ఇళ్లు కట్టాడు. అయితే అది ఈ భారీ వర్సాలకు శిథిలమైపోయింది. దీంతో ఆ ఇంటి కూల్చేసి ఓ జీ+1 ఇంటిని నిర్మిస్తున్నారు. అంతే అంతే తప్ప అది రాజభవనం కాదు.
ఈ క్రమంలోనే ఆ ఇంటి నిర్మాణం చేయడంతో ప్రత్యర్థులు ఏకంగా పవన్ కళ్యాణ్ భారీ ఫాంహౌస్ కొన్నారని.. అందులో అద్దాల మేడ కడుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. నిజానికి అది తప్పు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉంటున్న పాత ఫాంహౌస్ లోనే ఓ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటున్నాడు. దీన్ని చిలవలు పలువలు చేసి పవన్ కళ్యాణ్ ను అభాసుపాలు చేసే కుట్రకు ప్రత్యర్థులు తెరతీశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు ప్రచారం చేస్తున్నారు. అసలు నిజం ఇదీ..