
RBI
RBI: ఆర్బీఐ రుణ గ్రహీతలకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలకు సంబంధించిన చార్జీలపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని ఆర్బీఐ చెబుతోంది. పీనల్ చార్జీల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రుణం తీసుకున్న వారికి ఉపశమనం లభించనుంది. పీనల్ చార్జీలు అన్ని బ్యాంకులు ఒకేలా వసూలు చేయవు. తమకు తోచిన విధంగా బ్యాంకులు తమ విధానాలు అమలు చేస్తాయి. ఇందులో భాగంగానే చార్జీల వసూళ్లలో తేడాలు ఉంటాయి. వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఒక్కో బ్యాంక్ ఒక్కోలా ఈ పెనాల్టీ లు వేస్తున్నాయి, అవి మరీ ఎక్కువగా కూడా ఉన్నాయి. పెనాల్టీ పెనాల్టీ లా ఉండాలి, క్రమశిక్షణ పెంచేలా ఉండాలి గానీ, బ్యాంకులు దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడరాదు. ఇదీ ఆర్బీఐ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పీనల్ చార్జీలకు సంబంధించిన కొత్త తరహా మార్గదర్శకాలను విడుదల చేసింది.
చెక్ బౌన్స్ అయినప్పుడు..
చెక్ బౌన్స్ అయితే నేరం.. దాంట్లో మార్పు లేదు. మనం ఎప్పుడైన వాయిదా కట్టలేకపోతే అప్పుడు పెనాల్టీ వేస్తారు కదా, దాని గురించి ఈ మార్గదర్శకాలు ఆర్బీఐ విధించింది. మనం ఇచ్చే చెక్కులకు బ్యాంకులో తగిన నిల్వ లేకపోతే చెక్కులు బౌన్స్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో మనం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. వీటినే పీనల్ చార్జీలుగా చెబుతుంటారు. ఎస్బీఐ రుణాలకు సంబంధించిన వాటిపై ప్రీపేమెంట్ చార్జీలు వసూలు చేసేది ఒక శాతంగా ఉన్నాయి. జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. బ్యాంకుకో తీరుగా పీనల్ చార్జీలు వసూలు చేస్తుండటంతో పారదర్శకత లోపిస్తోంది. దీని వల్ల వినియోగదారులపై భారం పడుతోంది. ఇందులో లోపాలను సరిచేసేందుకు ఆర్బీఐ నిర్ణయించింది.

RBI
కస్టమర్లకు చేయూతగా..
రుణ గ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఆర్బీఐ క్యూఆర్ కాయిన్ వెండింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురానుంది.చెక్ బౌన్స్ అయినప్పుడు.. ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలపై పీనల్ చార్జీల్లో పారదర్శకత కోసం కొత్తగా ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ఈఎంఐలు కట్టనప్పుడు బ్యాంకులు ఈ మేరకు చార్జీలు వసూలు చేస్తాయి. దీంతో ఎక్కువ మొత్తంలో కాకుండా సాధారణ చార్జీలు విధించేందుకు ఉద్దేశించింది. దీంతో వినియోగదారులపై భారం తగ్గనుంది. ఇదివరకు చెక్ బౌన్స్ అయితే ఆయా సంస్థలు జరిమానాలు వసూలు చేయడంతో ఇక్కట్లు పడేవారు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా చేసింది. దీంతో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.