లాక్ డౌన్ టైంలో ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు!

కరోనా కట్టడికి లాక్ ‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికమని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలోకి జారుకుంటున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న సమయంలో ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తూ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఆయన భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసిందన్నారు. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని బ్యాంకుల కార్యకలాపాలు […]

  • Written By: Neelambaram
  • Published On:
లాక్ డౌన్ టైంలో ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు!


కరోనా కట్టడికి లాక్ ‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికమని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలోకి జారుకుంటున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న సమయంలో ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తూ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఆయన భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసిందన్నారు. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయని స్పష్టం చేశారు.

అంతేకాదు కరోనా సంక్షోభం ఉంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని చెప్పారు. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. జీ-20 దేశాల్లో మెరుగ్గా ఉన్నాం. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. భారత్ 1.9 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్‌లో ఏప్రిల్ నెలలో ఆహార ధరలు ఏకంగా 2.4శాతం పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఫిబ్రవరి 6 నుండి మార్చి 27 వరకు జిడిపిలో లిక్విడిటీ ఇంజెక్షన్ 3.2 శాతంగా ఉందన్నారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత)

లాక్ ‌డౌన్‌ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశామని తెలిపిన ఆర్బీఐ గవర్నర్.. చిన్నతరహా పరిశ్రమలకు రూ.50 వేల కోట్లు.. నాబార్డుకు రూ.25 వేల కోట్లు, జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు. మరోవైపు.. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉందన్నారు శక్తికాంత్ దాస్.

ఆర్బీఐ చర్యల ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు ద్రవ్యత గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నుండి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఆర్‌బీఐ పర్యవేక్షిస్తోందని పేర్కొన్న ఆయన, మార్చిలో ఎగుమతుల సంకోచం 34.6 శాతంగా ఉందని, 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మార్చిలో ఆటోమొబైల్ ఉత్పత్తి, అమ్మకాలు బాగా తగ్గాయని, విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయిందని శక్తికాంత దాస్ వెల్లడించారు.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube