Razakar Movie Teaser: రజాకర్ టీజర్ : చరిత్రను చెప్పాలనే ఈ ప్రయత్నం అద్భుతం
అలాంటి వాళ్ల అరాచకాలు ఇప్పటి తరానికి తెలియాలని వీళ్లు చేసే ఈ ప్రయత్నం అద్భుతం అందుకే ఒకప్పుడు ఇక్కడ జరిగిన అరాచకాలను రజాకార్ సినిమాలో చూపిస్తున్నట్టు గా ఈ టీజర్ చూస్తే మనకు అర్థం అవుతుంది.

Razakar Movie Teaser: తెలంగాణ గురించి చెప్పాలంటే చాలా గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న ఒక ప్రాంతం అనే చెప్పాలి.అయితే 1948 కి ముందు తెలంగాణ ప్రాంతం అయిన హైదరాబాద్ రాష్ట్రం నైజం నవాబ్ ల చేతిలో బందీ అయి ఉండేది. టోటల్ ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ల బానిసలు గా ఉంటె తెలంగాణ ప్రాంతం అంత కూడా నిజాం నవాబ్ కనుసన్నల్లో నడిచేది. ఎంతో మంది అమాయకుల రక్తం తో తడిచిన నేల ఇది…ఎంతో మంది ఆడవాళ్ల మానాలను పోగొట్టుకున్న ప్రాంతం ఇది…అప్పట్లో నిజాం ఆగడాలకు అడ్డు ఉండేది కాదు వాళ్ళు చెప్పిందే శాశనం… ఇక్కడ ఇస్లాం మతం తప్ప వేరే మతం ఉండకూడదని చాలా మంది అమాయకులని మత మార్పిడి చేసి ముస్లిం లు గా మార్చారు అలా మారడానికి ఇష్టపడని వాళ్ళని చంపేశారు…
అలాంటి వాళ్ల అరాచకాలు ఇప్పటి తరానికి తెలియాలని వీళ్లు చేసే ఈ ప్రయత్నం అద్భుతం అందుకే ఒకప్పుడు ఇక్కడ జరిగిన అరాచకాలను రజాకార్ సినిమాలో చూపిస్తున్నట్టు గా ఈ టీజర్ చూస్తే మనకు అర్థం అవుతుంది.
ఒకప్పటి చరిత్ర ని వక్రీకరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో వీళ్ళు ఇలాంటి సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఒకప్పుడు నిజాం చేసిన ఒక దుర్మార్గపు పని ఏంటంటే హైద్రాబాద్ రాష్ట్రం గా ఉన్న ఈ ప్రాంతం లో బతుకమ్మ పండగ అనేది మహిళలు చాలా గౌరవంగా చేసుకునే ఒక గొప్ప పండగ. అలాంటి పండగ రోజున ఆడవాళ్లు అందరూ కూడా పువ్వులతో పేర్చిన బతుకమ్మ ని ఒకచోట పెట్టీ దాని చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ చాలా సంబరం గా ఆడుకునే ఆట ఇది…ఇలాంటి గొప్ప సంస్కృతి ని అవమాన పరుస్తూ బతుకమ్మ ఆటని ఆడవాళ్ల ఒంటి మీద గుడ్డలు లేకుండా ఆడించిన ఆ నిజాం అరాచాకాలు ఇప్పటి యువత కి తెలియాలి…
ఈ సినిమా టిజర్ చూస్తుంటే అధ్యతం గుస్ బంస్ వచ్చేలా ఉంది. ఈ సినిమా లో నిజాం అరాచకాలు కళ్ళకి కట్టినట్టు గా చూపించబోతున్నాట్టు గా ఉన్నారు… ప్రతి తెలంగాణ పౌరుడు అనే కాదు ప్రతి ఒక్క మనిషి తెలంగాణ సమాజం ఎదురుకున్న అవమానాలను వాళ్ళు అనుభవించిన భాదలను చూడాలి…ఇక ఈ సినిమా మరో కాశ్మీర్ ఫైల్స్ అవుతుందేమో చూడాలి…ఈ సినిమాని ప్రాంతం,మతం అనే తేడా లేకుండా ఆనాటి మన సోదరులు ఎలాంటి ఇబ్బందులూ పడ్డారు అనేది తెలుసుకోవడానికి ఈ సినిమా చూడాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది…
