Ravi Teja- Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప బాటలో నడుస్తున్న రవితేజ?

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు మాస్ రాజా రవితేజ. ఇక వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి.

  • Written By: Suresh
  • Published On:
Ravi Teja-  Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప బాటలో నడుస్తున్న రవితేజ?

Ravi Teja- Allu Arjun: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో నటించిన సినిమాలు ఈ మధ్య మంచి సక్సెస్ ను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ ను సంపాదించినా.. చాలా సినిమాలు మాత్రం హిట్ తో దూసుకుపోయాయి. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక పాత్రను ఎంచుకుంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదిస్తూ ఉంటారు రవితేజ. దీంతో ఈయన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అంతే కాదు ఒకవేళ రవితేజను ఒక మాట అన్నా కూడా ఈయన అభిమానులు గొడవలకు దిగుతుంటారు కూడా.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు మాస్ రాజా రవితేజ. ఇక వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి. అయితే వీళ్ల కాంబినేషన్ లో ఇప్పుడు రాబోతున్న సినిమాలో రవితేజ రాయలసీమ యాసలో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇంతకుముందు చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన రవితేజ ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించారు.

ప్రస్తుతం ఈ హీరో రాయలసీమ యాసలో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో రాయలసీమ యాసలో నటించారు. అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా రాయలసీమ యాసలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక వీళ్ల బాటలోనే రవితేజ కూడా నటించి మెప్పించాలని చూస్తున్నారు. ఇక వీళ్ల కాంబో పైన ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ కొడితే వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ కొట్టిన బెస్ట్ జోడీగా వీళ్ల కాంబో రికార్డు క్రియేట్ చేస్తుంది.

అందరినీ ఆకట్టుకునేలా నాలుగోసారి హిట్ కొట్టేలా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట గోపీచంద్ మలినేని, రవితేజ. మరి బాక్సాఫీస్ ముందు వీరిద్దరూ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో అని ఇద్దరి అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి వీరి కాంబోలో సినిమా ఈ సారి ఎలా ఉండబోతుందో…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు