Ravi Teja- Gopichand Malineni: రవితేజ, గోపిచంద్ మలినేని కాంబో లో వస్తున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు… విలన్ ఎవరంటే..?
రీసెంట్ గా ఈయన చేసిన సినిమా టైగర్ నాగేశ్వరరావు దసరాకి వచ్చి ఒక మంచి విజయాన్ని అందుకుంది…ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ఈగల్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

Ravi Teja- Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారి వరసగా హిట్లు కొట్టి తనకంటూ ఒక స్టార్ డమ్ ని అలాగే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరో రవితేజ… ఈయనని తన ఫ్యాన్స్ మాస్ మహారాజా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈయన చేసే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
ఇక రీసెంట్ గా ఈయన చేసిన సినిమా టైగర్ నాగేశ్వరరావు దసరాకి వచ్చి ఒక మంచి విజయాన్ని అందుకుంది…ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ఈగల్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబోలో డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి మూడు సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలతో వీళ్ళు హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు.ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అదేంటంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక హీరోయిన్ విలన్ గా చేస్తున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ చేయనప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రోజుకి ఒకటి వచ్చి రవితేజ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగింపజేస్తున్నాయి. ఇక దీంతోపాటుగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నదింపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో రాయలసీమ యాసని మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక తెలుగులో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమ స్లాంగ్ మాట్లాడగా,ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాస లో మాట్లాడాడు.
ఇక ఇలా తమదైన రీతిలో యాసలను మార్చుకుంటూ మాట్లాడుతూ ఆ సినిమా బ్యాక్ డ్రాప్ ని సెలెక్ట్ చేసుకుంటూ చాలా మంచి స్టోరీలను చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇలా ప్రతి హీరో కూడా వెరైటీ కదలికలను ఎంచుకుంటూ ఒక మూస ధోరణి కి కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని సినిమాలు చేస్తే వాళ్లకు మంచి పేరు వస్తుందంటూ వరుసగా ఇలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు.ఇక ఇప్పుడు రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ సాధిస్తున్నారు…
