Ravela Kishore Babu :సైడ్ అయిన రావెల.. బీఆర్ఎస్ లో అప్పుడే లుకలుకలా..
పత్రిక ప్రారంభించారు. సోషల్ మీడియా బృందాలను పోషించారు. కానీ అటువంటి వ్యక్తి గుర్తింపు కోసం బీఆర్ఎస్ లో చేరారు.ఎందుకో రావెల కిశోర్ బాబు ఆయనతో విభేదిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

Ravela Kishore Babu : ఏపీలో విస్తరించాలనుకుంటున్న బీఆర్ఎస్ కు ఏదీ కలిసి రావడం లేదు. పార్టీ కార్యాలయం ప్రారంభంలోనూ ఆ పార్టీ నేతలు ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ భావిస్తున్నట్టు జాతీయ రాజకీయాలంటే తెలంగాణ, మహారాష్ట్రతో సరిపెట్టుకున్నట్టున్నారు. కానీ పొరుగు దాయాది రాష్ట్రం ఏపీని, పక్కనే ఉన్న ఒడిశాను అస్సలు పట్టించుకోవడం లేదు. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో సైతం జేడీఎస్ కుమారస్వామికి హ్యాండిచ్చారన్న ప్రచారం సాగింది. జేడీఎస్ అనుకున్న స్థానాలు దక్కకపోవడానికి ఆయనే కారణమన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడుఆయన ఫోకస్ అంతా తెలంగాణపై పెట్టినట్టు తెలుస్తోంది.ఏపీ రాజకీయాల గురించి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకుంటున్నట్టు కూడా కనిపించడం లేదు.
తెలంగాణ ప్రగతిభవన్ కు మించి ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం నేతలతో కిటకిటలాడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభంలో ఒక తోట చంద్రశేఖరం తప్ప పేరుమోసిన ఒక్క నాయకుడు కూడా కనిపించలేదు. కేసీఆర్ కానీ.. ఆయన మంత్రులు కానీ వచ్చి ఉండుంటే హడావుడి కనిపించేది. కానీ ఒక్కరంటే ఒక్కరూ కూడా రాలేదు. పోనీ ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నాయకులైనా వచ్చారంటే అదీ కూడా లేదు. తోట చంద్రశేఖర్ తో పాటే చేరిన రావెల కిశోర్ బాబు సైతం కార్యక్రమానికి ముఖం చాటేశారు. అదేంటి ఇంకా పురుడుబోసుకోక మునుపే ఈ లుకలుకలేంటి అని కొద్దిపాటి బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
ఏపీ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం అనేది తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా జరిగింది. తెలంగాణ నుంచి గులాబీ అతిథులెవ్వరూ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. వారింకా ఏపీపై పూర్తిగా శ్రద్ధ పెట్టడం లేదని అనుకోవచ్చు. కానీ రావెల కిశోర్ బాబు ఎందుకు హాజరు కాలేదో అంతుచిక్కని ప్రశ్న. వాస్తవానికి తోట చంద్రశేఖర్ కి చిరంజీవి కుటుంబం సముచిత స్థానమే ఇచ్చింది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా తోట చంద్రశేఖర్ ఆ పార్టీలో కీలక నేత. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీలో కీలకంగానే ఉన్నారు. జనసేన కోసం ఒక టీవీ ఛానెల్ ను కొన్నారు. పత్రిక ప్రారంభించారు. సోషల్ మీడియా బృందాలను పోషించారు. కానీ అటువంటి వ్యక్తి గుర్తింపు కోసం బీఆర్ఎస్ లో చేరారు.ఎందుకో రావెల కిశోర్ బాబు ఆయనతో విభేదిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.