IPL GT vs CSK : ఐపీఎల్‌లో శ్రీవల్లి, ఊ అంటావా.. నాటునాటుకు స్టెప్పులేసి దుమ్ము దులిపిన రష్మిక, తమన్నా
IPL GT vs CSK : ఐపీఎల్-16 సీజన్‌కు కాసేపట్లో తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా డిపెండింగ్ చాపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ నేపథ్యలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈసారి ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. స్టార్ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించాడు. వేడుకల్లో అందమైన భామలు అలరించారు. […]

IPL GT vs CSK : ఐపీఎల్-16 సీజన్‌కు కాసేపట్లో తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా డిపెండింగ్ చాపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ నేపథ్యలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈసారి ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. స్టార్ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించాడు. వేడుకల్లో అందమైన భామలు అలరించారు. సినిమా హీరోయిన్లు రష్మిక మందాన, తమన్నా తమ స్టెప్పులతో అదరగొట్టారు.
వేడుకలకు హాజరైన బీసీసీఐ అధ్యక్షుడు
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం నిండిపోయింది. అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాడు. ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా హాజరయ్యారు.
ఉర్రూతలూగించిన సామి సామి పాట..
సినీ నటి రష్మిక మందాన పుష్ప సినిమాలోని ‘సామి సామి ’, ‘శ్రీ వల్లి’ పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకూ రష్మిక నృత్యం చేసి అలరించింది.
https://twitter.com/IPL/status/1641796020756697088?s=20
ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా అన్న తమన్నా..
ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో సినీ నటి తమన్నా భాటియా తన డ్యాన్స్‌తో అలరించింది. వివిధ భాషల పాటలకు డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను మైమరిపించింది. తెలుగు సినిమా ‘పుష్ప’లోని ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా అనే పాటకు తమన్నా వేసిన స్టెప్పులకు మోదీ స్టేడియం ఊగిపోయింది.
అదిరిపోయిన ఆరంభ వేడుకలు..
మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఐసీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు మొత్తంగా అదిరిపోయాయి. సినీ స్టార్ల ప్రదర్శనలతో నరేంద్రమోదీ స్టేడియం హోరెత్తనుంది.
https://twitter.com/IPL/status/1641793206470991872?s=20