Rashmika Mandanna: రష్మికను పబ్లిక్ లో అడ్డంగా బుక్ చేసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్… ఆమె నోటి నుండి నో వర్డ్స్!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ బేబీ. ఈ చిత్రంలోని ఓ లిరికల్ సాంగ్ ని రష్మిక మందాన లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ, రష్మిక పాల్గొన్నారు. రష్మిక మాట్లాడుతున్న సమయంలో వదిన వదిన అంటూ పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నినాదాలు చేశారు.

  • Written By: Shiva
  • Published On:
Rashmika Mandanna: రష్మికను పబ్లిక్ లో అడ్డంగా బుక్ చేసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్… ఆమె నోటి నుండి నో వర్డ్స్!

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ-రష్మిక మందాన లవర్స్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం అవుతుంది. వీరిద్దరు కలిసి రెండు చిత్రాలు చేశారు. ఈ క్రమంలో ప్రేమలో పడిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేదిగా వారి ప్రవర్తన ఉంది. పలుమార్లు విజయ్ దేవరకొండ-రష్మిక ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ దొరికారు. నైట్ డిన్నర్ పార్టీలు చేసుకున్నారు. అలాగే రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెకేషన్ కి జంటగా వెళ్లారు. కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు.

ఇదే విషయాన్ని అడిగితే అందులో తప్పేముందని రష్మిక ఎదురు ప్రశ్నించారు. మిత్రులు వెకేషన్ కి వెళ్ళరా అని సమర్ధించుకున్నారు. విడివిడిగా వెళ్లినట్టు కలరించి ఇచ్చి అక్కడ ఒకే గదిలో వీరు స్టే చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. వారు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదని తాజా ఉదంతంతో తేలిపోయింది. రష్మికను వదిన అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పబ్లిక్ లో బుక్ చేశారు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ బేబీ. ఈ చిత్రంలోని ఓ లిరికల్ సాంగ్ ని రష్మిక మందాన లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ, రష్మిక పాల్గొన్నారు. రష్మిక మాట్లాడుతున్న సమయంలో వదిన వదిన అంటూ పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దానికి రష్మికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బేబీ సినిమా, ఆ చిత్ర లిరికల్ సాంగ్ గురించి మాట్లాడి ఆమె అక్కడ నుండి వెళ్లిపోయారు.

మరిదికి సాయం చేయడం కోసం రష్మిక వచ్చారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ వలె మెలుగుతుంది. వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా ఆమెకు ఆహ్వానం ఉంటుంది, హాజరవుతుంది. దీంతో ఆనంద్ దేవరకొండతో కూడా రష్మికకు పరిచయం, సాన్నిహిత్యం ఉన్నాయి. అందుకే అడగ్గానే కాదనకుండా బేబీ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. బేబీ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడిగా ఉన్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు