Rakshit Shetty: రష్మిక ఇంకా నాతో టచ్ లోనే ఉంది… సీక్రెట్ లీక్ చేసిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి!

రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. 2016లో విడుదలైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు. రక్షిత్ శెట్టి-రష్మిక జంటగా నటించారు. కిరిక్ పార్టీ షూటింగ్ సెట్స్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

  • Written By: Shiva
  • Published On:
Rakshit Shetty: రష్మిక ఇంకా నాతో టచ్ లోనే ఉంది… సీక్రెట్ లీక్ చేసిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి!

Rakshit Shetty: అనతికాలంలో పరిశ్రమలో ఎదిగిన రష్మిక మందాన కెరీర్లో అదే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. మొన్నటి వరకు కన్నడ పరిశ్రమ నుండి ఆమె వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమె కామెంట్స్ అందుకు కారణమయ్యాయి. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసిన రిషబ్ శెట్టి అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసహనం బయటపెట్టాడు. శాండల్ వుడ్ రష్మిక హోమ్ ఇండస్ట్రీ కాగా అక్కడ సినిమాలు చేయడం లేదు. కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఓ ఘటన ఆమెను కన్నడ పరిశ్రమకు దూరం చేసింది.

రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. 2016లో విడుదలైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు. రక్షిత్ శెట్టి-రష్మిక జంటగా నటించారు. కిరిక్ పార్టీ షూటింగ్ సెట్స్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది పెళ్లి వరకు వెళ్ళింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా రష్మిక మనసు మారింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు రక్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పేసింది. ఇది వివాదాస్పదమైంది. రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా ఏకిపారేశారు.

దాంతో తెలుగు పరిశ్రమపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ కి వచ్చాక విజయ్ దేవరకొండతో ఆమె సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరూ ఏకాంతంగా వివాహరిస్తున్నారు. రెండుసార్లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఒకే హోటల్ లో స్టే చేశారు. ఇదే విషయం అడిగితే… మేమిద్దరం ఫ్రెండ్స్. మిత్రులు కలిసి వెకేషన్ కి వెళ్ళకూడదా అంటూ ఎదురు ప్రశ్నించింది రష్మిక. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంది… ఏదో ఒక రోజు ఓపెన్ అవుతారని అందరూ బావిస్తున్నారు.

తాజాగా మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రష్మిక నాతో టచ్ లోనే ఉంది. మేమిద్దరం మొబైల్స్ లో సందేశాలు పంపుకుంటాము. మా సినిమాల విడుదల ఉంటే ఒకరికొకరం బెస్ట్ విషెస్ చెప్పుకుంటాము… అని ఆయన అన్నారు. బ్రేకప్ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనుకుంటున్న వేళ రక్షిత్ శెట్టి కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ వంటి భారీ చిత్రాల్లో రష్మిక నటిస్తుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు