Rashmika Mandanna: ఇంత అత్యాశ అవసరమా ? రష్మిక!

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ రష్మిక అత్యాశకు పోయి చేతికి వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నట్టు తెలుస్తుంది. నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది.

  • Written By: SRK
  • Published On:
Rashmika Mandanna: ఇంత అత్యాశ అవసరమా ? రష్మిక!

Rashmika Mandanna: సినిమా రంగంలో రాణించాలంటే ఒక్క టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. లక్ కలిసి రావాలి అదే విధంగా కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు కూడా హీరో హీరోయిన్ సినీ కెరీర్ ను డిసైడ్ చేస్తాయి. ఒక్క చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్న కానీ కెరీర్ మొత్తం నాశనం కావటం ఖాయం. అందుకే ఈ పరిశ్రమలో ఉన్నవాళ్లు తమకు సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్లనే మేనేజర్ లాగా పెట్టుకొని ముందుకు సాగుతారు.

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ రష్మిక అత్యాశకు పోయి చేతికి వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నట్టు తెలుస్తుంది. నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఇందులో రష్మిక ను హీరోయిన్ గా ఎంపిక చేసి, పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వచ్చి సినిమాను ప్రారంభించారు.

వీరి కాంబోలో గతంలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే, దీనితో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. పైగా సరికొత్త జోనర్ లో వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఉన్నట్లు ఉంది రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆమె మాజీ మేనేజర్ కిరణ్ తో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి అతని హస్తం కూడా ఉందని తెలుస్తుంది.

ఇదే సమయంలో పుష్ప సినిమా వలన వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని బాలీవుడ్ పాక వేయాలని చూస్తున్న రష్మిక తెలుగు సినిమాలను దూరం పెట్టినట్లు తెలుస్తుంది. అలాగని ఆమెకు బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కూడా రాలేదు. ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అంటూ ఏమీ లేదు. షాహిద్ కపూర్ తో సినిమా ఒకటి ఫైనల్ కావటంతో ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని అనుకోని ముందు ఒప్పుకున్న నితిన్ సినిమా నుంచి తప్పుకుంది రష్మిక.

అయితే బడ్జెట్ సమస్య వలన షాహిద్ సినిమా ఆగిపోవడంతో రష్మిక ఆశలు అడియాశలు అయ్యాయి. ఇటు చూస్తే నితిన్ సినిమాలో రష్మిక స్థానంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల జాయిన్ అయ్యింది. దీనితో ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అనే రీతిలో తయారైంది రష్మిక పరిస్థితి. నిజం చెప్పాలంటే రష్మిక చేతిలో ఒక్క పుష్ప 2 తప్ప మరో పెద్ద సినిమా లేదు. ఇలాంటి టైం సరిగ్గా ప్లాన్ చేసుకొని అడుగులు వేయాల్సిన రష్మిక అత్యాశకు పోయి బాలీవుడ్ భాజా మోగించాలని చూసి ఇప్పుడు బొక్క బోర్లా పడిందనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు