Rashmika Mandanna: రష్మిక కాళ్ల మీద పడ్డ పెళ్లి కొడుకు … అసలేం జరిగింది. ?
తాజాగా రష్మిక తన పర్సనల్ మేకప్ అసిస్టెంట్ పెళ్ళి లో సందడి చేసింది. నూతన వధూవరులకు ఆమె శుభాకాంక్షలు చెప్పగా వాళ్ళు చేసిన పనికి రష్మిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఒక్కసారిగా రష్మిక కాళ్ల మీద పడ్డారు.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక సినిమాల్లో ఎంత బిజీ బిజీగా ఉన్న కానీ తన పర్సనల్ స్టాఫ్ విషయంలో చాలా కేర్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హీరో హీరోయిన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కంటే కూడా పర్సనల్ స్టాఫ్ తోనే ఎక్కువ గడుపుతారు. అందుకే వాళ్లకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కనిపిస్తారు.
తాజాగా రష్మిక తన పర్సనల్ మేకప్ అసిస్టెంట్ పెళ్ళి లో సందడి చేసింది. నూతన వధూవరులకు ఆమె శుభాకాంక్షలు చెప్పగా వాళ్ళు చేసిన పనికి రష్మిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఒక్కసారిగా రష్మిక కాళ్ల మీద పడ్డారు. దీనితో మొదటి లో కొంచెం కంగారు పడిన రష్మిక ఆ తర్వాత తేరుకొని వాళ్ళని ఆశీర్వదించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక రష్మిక పెళ్లి విషయానికి వస్తే గతంలో ఆమె క్లారిటీగా చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, సినీ ప్రయాణం సాఫీగా సాగుతుందని తెలిపింది. మరోపక్క విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య లవ్ ట్రాక్ ఉందని త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మాటలు కూడా ఫిలిం నగర్ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా దీనిపై మాట్లాడకపోవడం విశేషం.
పుష్ప 1 ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న రష్మిక రణబీర్ కపూర్ హీరోగా వస్తున్నా “యానిమల్” సినిమా మీద భారీ ఆశలే పెట్టుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం రష్మిక పుష్ప 2 లో మాత్రమే నటిస్తుంది. దీని తర్వాత మరో సినిమా ఏది కమిట్ కాలేదు రష్మిక. మరోపక్క హిందీలో షాహిద్ కపూర్ సరసన రష్మిక నటించాల్సిన సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది
