Bomma Blockbuster Review: నటీనటులు:
నందకిశోర్, రష్మీగౌతమ్, కిరీటీ ధమరాజు, రఘు కుంచె
టెక్నీషియన్స్:
డైరెక్టర్: రాజ్ విరాట్
నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మడ్డి, మనోహర్ రెడ్డి ఈద
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

rashmi gautam, Nandu
చిన్న సినిమాలైనా ఈ మధ్య కొన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన కథతో తెరపైకి వస్తున్నాయి. యాంకర్ గా మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న రష్మీ గౌతమ్ సినిమాల్లో కనిపించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ‘గుంటూరు టాకీస్’ తో ఎంట్రీ ఇచ్చినా.. ఆ తరువాత గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా నందకిశోర్ కు జోడీగా ఆమె ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ తో ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దీనిపై హోప్స్ పెరిగాయి. ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
మత్స్యకారుడైన పోతురాజు డైరెక్టర్ పూరిజగన్నాథ్ భక్తుడు. తాను ఓ స్టోరీ రాసి..దానిని ఎప్పటికైనా పూరికి అందించాలని అనుకుంటాడు. కట్ చేస్తే నందకిశోర్ అల్లర, చిల్లరగా తిరుగే వ్యక్తి. తన చేష్టల వల్ల చాలా మంది నష్టపోతుంటారు. ఈ క్రమంలో రేష్మితో ప్రేమలో పడుతాడు. ఆమె కోసం గొడవలు కూడా పెట్టుకుంటాడు. అయితే ఆ తరువాత కొన్ని చిక్కుల్లో పడుతాడు. ఇదిలా ఉండగా పోతురాజుకు, నందకిషోర్ లవ్ స్టోరీకి సంబంధం ఉంటుంది.. ఆ విషయం తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
భారీ బడ్జెట్, పెద్ద కథలకు భిన్నంగా ఉంటుందీ సినిమా. ఇందులో పెద్దగా కథ ఉండదు. కానీ చిన్న పాయింట్ తో ఆసక్తికరంగా అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. కథలో కొన్ని లోపాలు ఉన్నా అవి కనిపించకుండా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఫస్టాప్ ఆసక్తికరంగా ఉన్నా.. సెకండాఫ్ కు వచ్చే సరికి స్లో అవుతుంది. స్టోరీ ట్రాక్ తప్పుతుంది. ఆ తరువాత పాత్రలు తమ నటనతో ట్రాక్ లోకి తీసుకొస్తారు.

rashmi gautam Nandu
ఎవరెలా చేశారంటే..?
మాస్ యువకుడిగా నందకిశోర్ అద్భతంగా నటించారు. సినిమా మొత్తం హీరో చుట్టే తిరుగుతుండడంతో ఆయనే హైలెట్ అవుతాడు. రష్మీ గౌతమ్ తన ఫర్ఫామెన్స్ ను చూపించింది. కిరీటి ధమరాజు, రఘు కుంచెల తమ నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నీషియన్స్ పనితీరు ఎలా ఉందంటే..?
చిన్న పాయింట్ తో డైరెక్టర్ రాజ్ విరాట్ సినిమాను చూపించి మెప్పించాడు. అతని టేకింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. సుజాత సిద్ధార్థ సినిమాగోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రశాంత్ ఆర్ విహారి పాటలు ఆకట్టుకోనప్పటికీ బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ముగింపు: మొత్తం మీద ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని ఇస్తుంది.
రేటింగ్: 2.75