Enemies Of Tollywood: టాలీవుడ్ బద్దశత్రువులు ఒక చోట చేరారు. చేయి చేయి కలుపుకుని మాటామంతి చెప్పుకున్నారు. ఈ అరుదైన సంఘటన విశ్వక్ సేన్ కొత్త మూవీ లాంఛ్ వేదికగా జరిగింది.హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ కొత్త చిత్రం నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా పవన్ కళ్యాణ్, మంచు విష్ణు హాజరయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్ సైతం రావడం జరిగింది. మంచు విష్ణు నటుడు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. మా ఎన్నికల నేపథ్యంలో వీరి మధ్య జరిగిన గొడలు గుర్తు చేసుకున్న జనాలు వీరి కలయిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

Vishnu, Prakash Raj
2021 అక్టోబర్ నెలలో జరిగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. మా అధ్యక్షుడు పదవికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీపడ్డారు. ఎన్నికల ప్రకటన తేదీ రాకముందే టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ప్రకాష్ రాజ్ కి నాగబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. చిరంజీవి సైతం పరోక్షంగా ప్రకాష్ గెలవాలని కోరుకున్నారు. ఇక మంచు విష్ణుకి సప్పోర్ట్ గా కృష్ణ, నందమూరి కుటుంబాలు నిలిచాయి. వారిని కలిసి మంచు విష్ణు మద్దతు కోరారు. మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణు కోసం అన్నీ తానై వ్యవహరించారు.
ఎన్నికల క్యాంపైన్ పేరుతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు విమర్శల దాడికి దిగారు. ఆ దాడులు శృతిమించి వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లాయి. నాగబాబు పై నరేష్, నరేష్ పై నాగబాబు అవాకులు చవాకులు పేల్చుకున్నారు. మంచు విష్ణు వర్గం ప్రకాష్ రాజ్ పై వ్యక్తిగత దూషణలకు దిగడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమ పరువు బజారుకు ఈడ్చారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ జరిపిన ప్రచారం సక్సెస్ అయ్యింది. చివరికి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు.

Vishnu, Prakash Raj
ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రచ్చ ఆగలేదు. అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అలాగే ఆయన ప్యానెల్ తరపున గెలిచిన శ్రీకాంత్ తో పాటు మరికొందరు సభ్యులు రాజీనామా చేశారు. నాగబాబు ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మా ఎన్నికల ఫలితాల అనంతరం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మరలా కలిసిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు విశ్వక్ సేన్ కొత్త మూవీ లాంచ్ వేడుకలో వీరిద్దరి అరుదైన కలయిక సాధ్యమైంది.
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ చేయి చేయి కలిపి మాట్లాడుకోవడం విశేషంగా మారింది. పవన్ కళ్యాణ్ తో కూడా మంచు విష్ణు మాట్లాడారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రకాష్ రాజ్ ఓటమి మెగా ఫ్యామిలీ ఓటమిగా అందరూ భావించారు. అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత చిరంజీవిపై మంచు విష్ణు ఆరోపణలు చేశారు. చిరంజీవి అంకుల్ ఫోన్ చేసి ఎన్నికల నుండి విరమించుకోవాలని చెప్పాడని మీడియా ముఖంగా చెప్పారు. మోహన్ బాబు, చిరు కుటుంబాల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తుంది.

Raghavandra Rao, Viswak Sen, Pavan Kalyan, Arjun, Prakash Raj, Vishnu