Rangasthalam Movie: రంగస్థలం’ చిత్రం చిరంజీవి పాత సినిమాకి రీమేకా? ఇన్ని రోజులు ఎవ్వరూ గుర్తుపట్టలేదుగా!

స్టోరీ లైన్ ఒకేలాగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం వేరుగా ఉంటుంది. రంగస్థలం లో క్లైమాక్స్ సన్నివేశాన్ని మనం ఊహించలేము, కానీ ‘జాతర’ చిత్రం మాత్రం చాలా సాదాసీదాగా వెళ్ళిపోతుంది.ఈ చిత్ర దర్శకుడు ధవళ సత్యం కూడా గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రంగస్థలం చిత్రం నా జాతర చిత్రం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిందే అని కామెంట్ చేసాడు కూడా.

  • Written By: Vicky
  • Published On:
Rangasthalam Movie: రంగస్థలం’ చిత్రం చిరంజీవి పాత సినిమాకి రీమేకా? ఇన్ని రోజులు ఎవ్వరూ గుర్తుపట్టలేదుగా!

Rangasthalam Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు. రాబొయ్యే రోజుల్లో ఆయన పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని శాశించొచ్చు, కానీ ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన ‘రంగస్థలం’ చిత్రానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది. అప్పటి వరకు వరుసగా రొటీన్ సినిమాలే చేస్తున్నాడు. యాక్టింగ్ కూడా చాలా రొటీన్ అయిపోయింది అంటూ రామ్ చరణ్ పై విమర్శలు వచ్చేవి.

ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ పై ఉన్న ఆ ముద్ర జరిగిపోయింది.టాలీవుడ్ లో విలక్షణమైన నటులలో ఒకడిగా రామ్ చరణ్ కి పేరొచ్చింది ఈ సినిమాతో. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఈ సినిమా 28 శాతం GST టాక్స్ ని తట్టుకొని, 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ద్వారా వచ్చిన థియేట్రికల్ అనుభూతి అంతకు ముందు ఏ సినిమాకి కూడా రాలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది. టాలీవుడ్ లో ఆ సన్నివేశం ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు.

అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘జాతర’ కి అనధికారిక రీమేక్ అని చెప్పొచ్చు. ధవళ సత్యం దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా హీరో కి ఒక అన్నయ్య ఉంటాడు, పల్లెటూర్లో జరిగే లోకల్ రాజకీయాల్లో అతనిపై కుట్రలు చేసి చంపేస్తారు. అప్పుడు హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ. రంగస్థలం చిత్రం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

స్టోరీ లైన్ ఒకేలాగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం వేరుగా ఉంటుంది. రంగస్థలం లో క్లైమాక్స్ సన్నివేశాన్ని మనం ఊహించలేము, కానీ ‘జాతర’ చిత్రం మాత్రం చాలా సాదాసీదాగా వెళ్ళిపోతుంది.ఈ చిత్ర దర్శకుడు ధవళ సత్యం కూడా గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రంగస్థలం చిత్రం నా జాతర చిత్రం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిందే అని కామెంట్ చేసాడు కూడా.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు