Rajamouli- Ranbir Kapoor: కలిసిన ప్రతి సారి రాజమౌళి కాళ్ళ మీద పడుతున్నా రణ్ బీర్ కపూర్ ఇదంతా దాని కోసమేనా..?

.ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమా ద్వారా వరల్డ్ మొత్తం లో మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

  • Written By: Gopi
  • Published On:
Rajamouli- Ranbir Kapoor: కలిసిన ప్రతి సారి రాజమౌళి కాళ్ళ మీద పడుతున్నా రణ్ బీర్ కపూర్ ఇదంతా దాని కోసమేనా..?

Rajamouli- Ranbir Kapoor: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమా ద్వారా వరల్డ్ మొత్తం లో మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఎక్కడ కనిపిస్తే అక్కడ బాలీవుడ్ హీరో అయిన రణ్ బీర్ కపూర్ రాజమౌళి కాళ్ళ మీద పడి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు.

ఇక రణ్ బీర్ కపూర్ హీరో గా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాజమౌళి కాళ్ళకి రణ్ బీర్ దండం పెట్టాడు. అలాగే ఒక పబ్లిక్ ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కూడా రణ్ బీర్ రాజమౌళి ని విష్ చేస్తూ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన కాళ్లకు దండం పెట్టాడు. పబ్లిక్ గా ఇలాంటివి చేయడం రాజమౌళి కి అసలు నచ్చదు.కానీ రణ్ బీర్ కపూర్ మాత్రం రాజమౌళి చెప్పిన వినకుండా తన కాళ్ళ మీద పడడం రాజమౌళికి నచ్చడం లేదు. ఇక ఇలాంటి క్రమంలో రణ్ బీర్ కపూర్ రాజమౌళి ని కాకా పడుతూ ఆయన కాళ్ళ మీద పడుతున్నాడని మరికొందరు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అలాగే ఇప్పుడు ఆయనతో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ రాజమౌళి ఎవరితో సినిమా చేయాలనుకుంటాడో వాళ్లతో మాత్రమే సినిమా చేస్తాడు. అంతే తప్ప రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ హీరోలని పెట్టుకొని మార్కెట్ విపరీతంగా విస్తరింప చేసుకుందామనే ఆలోచనలో అతడు లేడు.ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకి ఉన్న మార్కెట్ కంటే కూడా రాజమౌళి కి ఉన్న మార్కెట్ పెద్దది…

అందుకే ఆయనతో ఒక సినిమా చేస్తే మార్కెట్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది అనేది బాలీవుడ్ హీరోలు బలంగా నమ్ముతున్నారు.ఇక అందులో భాగంగానే చాలామంది హీరోలు రాజమౌళి ని కాక పట్టినప్పటికీ ఆయన మాత్రం ఎవరికీ లొంగడం లేదు. ఎందుకంటే రాజమౌళి ఒకప్పుడు బాలీవుడ్ హీరోలకి కథలు చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు ముఖ్యంగా బాహుబలి సినిమాని మొదటగా బాలీవుడ్ హీరో అయిన హృతిక్ రోషన్ తో చేద్దామని ముందుగా ఆయనకి కథ చెప్పడం జరిగింది. అయినప్పటికీ సౌత్ డైరెక్టర్లు, సౌత్ సినిమాలు అంటే నచ్చని హృతిక్ రోషన్ రాజమౌళి ని రిజెక్ట్ చేశాడు. దాంతో బాహుబలి సినిమా తీసి రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు అప్పుడు అలా చేశారు కాబట్టే రాజమౌళి బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం లేదని అర్థమవుతుంది.

ఇక రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమా సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజమౌళి ని వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్ కి సమాధానం చెబుతూ త్రిబుల్ ఆర్ ఇండియన్ సినిమా కాదు సౌత్ ఇండియన్ సినిమా అంటూ రాజమౌళి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక రాజమౌళి అలా చెప్పడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అప్పట్లో సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అసలు పట్టించుకునేది కాదు అసలు మన సినిమా హీరోలను గాని, డైరెక్టర్లను గాని ఎందుకు పనికిరారు అన్నట్టుగా చూసేవారు. అలాగే వీళ్ళకి సినిమాలు తీయడం రాదు అనే ఉద్దేశ్యం లో ఉండేవారు కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. రాజమౌళి లాంటి డైరెక్టర్ ప్రపంచ స్థాయిలో సినిమాలు తీస్తుంటే బాలీవుడ్ డైరెక్టర్లు తీసే సినిమాలు పెద్దగా ఆడటం లేదు.ఇక దాంతో బాలీవుడ్ హీరోలు రాజమౌళి తో ఒక సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు