1945 Movie Review: నటీనటులు: రానా దగ్గుబాటి, రెజీనా కసాండ్రా, సత్యరాజ్, నాజర్, కాలి వెంకట్, సప్తగిరి తదితరులు
నిర్మాత: సీ కల్యాణ్
రచన, దర్శకత్వం: సత్యశివ
సినిమాటోగ్రఫి: సత్య పన్మార్
ఎడిటింగ్: గోపికృష్ణ
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: కే ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-01-07

Rana Daggubati and Regina 1945 Movie Review
అసలు కథ ఏమిటి ? సినిమా ఎలా ఉంది ?
1945లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపిస్తాడు. ఆ సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకునేందుకు ఆది (రానా) బర్మాకు వెళ్లడం, అక్కడ తహసీల్దార్ (నాజర్) కూతురు (రెజీనా)తో ప్రేమలో పడతాడు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అక్కడ బ్రిటిష్ పాలన పై ఆదికి అసంతృప్తి పెరిగి.. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేయాలని ఆది నిర్ణయించుకుంటాడు.
నీ అంతలో ఆది జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి ? చివరకు ఆది ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? బ్రిటీష్ పాలకులపై ఎలా పోరాటం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే.. ఇదొక ఎమోషనల్ డ్రామా. దర్శకుడి పనితీరు బాగుంది. అలాగే సత్యశివ ఎంచుకొన్న పాయింట్ కూడా చాలా కొత్తగా ఉంది. అలాగే స్వాతంత్రం పూర్వం జరిగిన కొన్ని ఊహాజనిత సన్నివేశాలను తెర మీద బాగా చూపించారు. అలాగే బాగా చిత్రీకరించారు. రానా, రెజీనా కసాండ్రా జంట కూడా బాగుంది.
Also Read: ఎన్నో ఏళ్ళ పూజాహెగ్డే కోరికను నెరవేర్చిన ప్రభాస్..!
ప్లస్ పాయింట్స్ :
రానా నటన,
సినిమా నేపథ్యం,
సంగీతం,
రియలిస్టిక్ డ్రామా
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే,
ఇంట్రెస్టింగ్ సాగని స్టార్టింగ్ సీన్స్,
స్లో నేరేషన్,
బోరింగ్ ఎమోషనల్ సీక్వెన్స్.
సినిమా చూడాలా ? వద్దా ?
ఒకసారి చూడోచ్చు. కాకపోతే సినిమాలో చూపించిన ఎమోషనల్ కంటెంట్ ఈ డిజిటల్ జనరేషన్ కి కనెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి, ఈ అంశంలో ప్రేక్షకులు ముందుగానే ఓ అవహగానాకు వచ్చి సినిమాకి వెళ్లడం బెటర్.
oktelugu.com రేటింగ్ 2/5
Also Read: బాధల అనంతరం సంతోషంలో ‘షారుఖ్ ఖాన్’