https://oktelugu.com/

Maharashtra : 89 శాతం స్ట్రైక్ రేటుని మహారాష్ట్రలో బీజేపీ ఎలా సాధించింది?

Maharashtra: 89 శాతం స్ట్రైక్ రేటుని మహారాష్ట్రలో బీజేపీ ఎలా సాధించింది? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2024 / 12:17 PM IST

    Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల్లో 149 సీట్లకు పోటీచేసి 132 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అంటే 89 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఇదో రికార్డ్ అని చెప్పొచ్చు. 150 సీట్లు పోటీచేసి 89 స్ట్రైక్ రేట్ అంటే మామూలుగా సాధ్యమయ్యేది కాదు. తక్కువ సీట్లకు పోటీచేస్తే వేరే అనుకోవచ్చు.

    తాజాగా ఎకనమిక్స్ టైమ్స్ లో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎలా సాధ్యమైందన్న దానిపై కథనం వేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బాగా దెబ్బతిన్నది. వెంటనే బీజేపీ ఆలోచించి ఒక కమిటీని వేశారు. భూపేంద్రయాదవ్, అశ్విని వైష్ణవ్ లతో ఈ బీజేపీ కమిటీ వేశారు. మహారాష్ట్రకు బీజేపీ ఇన్ చార్జులుగా వీరిని వేశారు. దీనికి అమిత్ షా గైడెన్స్ ఇచ్చారు.

    భూపేంద్ర, అశ్వినిలు ఇన్ చార్జిలుగా వచ్చాక రెండు ఏజెన్సీలను తీసుకున్నారు. వారాహే ఎనలటిక్స్, జార్వీస్ కన్సల్టెన్స్ ల సహాయాన్ని బీజేపీ తీసుకుంది. 280కి పైగా ఉన్న నియోజకవర్గాల్లో సర్వేలు చేశారు. మూడు కేటగిరీలు చేశారు. గ్యారెంటీగా గెలుస్తామన్నవి ఒక కేటగిరీ చేశారు. గెలుస్తామన్నవి ఐడెంటిఫై చేశారు. ఇక స్వింగ్ నియోజకవర్గాలను ఐడెంటీ చేసి పనిచేశారు.

    89 శాతం స్ట్రైక్ రేటుని మహారాష్ట్రలో బీజేపీ ఎలా సాధించింది? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.