Lok Sabha Elections 2024 : 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితేంటి? వాళ్ల అంతర్గత చర్చల్లో, నాయకుల్లో జరుగుతున్న సంభాషణల్లో ‘ఈసారైనా మాకు ప్రతిపక్ష హోదా’ వస్తుందా? అని డౌట్ పడుతున్నారు. అందరికీ తెలుసు ఈసారి కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతారని అందరికీ అర్థమైంది. కాకపోతే 2014, 2019లో కనీసపు ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కు దక్కలేదు. 2024లోనైనా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా వస్తుందా? రాదా అన్నది అంతర్మథనంగా ఉంది.
దేశంలో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు రావాలి. మొత్తం 543 పార్లమెంట్ సీట్లలో 10 శాతం అంటే 55. పోయిన సారి 52 వచ్చాయి. మూడు సీట్లు తగ్గాయి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో కాంగ్రెస్ కోరుతోంది.
ఈసారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.. రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎన్ని అని చూస్తే..
ఈసారైనా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.