Ramoji Rao: రామోజీరావుకు భయం లేదా?
రామోజీరావుని విచారించడానికి ఏపీ సీఐడీ ఏకంగా ఇంటికి వెళ్ళింది. సిఐడి దూకుడును చూసిన రామోజీరావు మంచానికి పరిమితం కావలసి వచ్చింది.

Ramoji Rao: మీడియా మొగల్ రామోజీరావు జగన్ కు భయపడడం లేదా?దశాబ్దాల కాలం పాటు రాజకీయాలనే షేక్ చేసిన రాజగురువు తనపై ఉన్న కేసులను లైట్ తీసుకుంటున్నారా? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. జగన్ చర్యలతో రామోజీరావు బెంబేలెత్తిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో రామోజీరావు రాజకీయ ఆధిపత్యానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి చెక్ చెప్పగా.. ఇప్పుడు జగన్ ఏకంగా వెంటాడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇంతవరకు అతిపెద్ద మీడియా గ్రూపునకు అధిపతి అయిన రామోజీరావును టచ్ చేయడానికి ఏ ప్రభుత్వం సాహసించలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారింది.
రామోజీరావుని విచారించడానికి ఏపీ సీఐడీ ఏకంగా ఇంటికి వెళ్ళింది. సిఐడి దూకుడును చూసిన రామోజీరావు మంచానికి పరిమితం కావలసి వచ్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎంత చేయాలో అంతలా రామోజీ ప్రయత్నించారు. అయినా సరే జగన్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అయితే ఇది కేవలం రాజకీయ వైరమే కాదు. దశాబ్దాలుగా తనకున్న మీడియా సపోర్ట్ తో రాజకీయాలతో పాటు అన్ని రంగాలను రామోజీ తన కనుసన్నల్లో పెట్టుకున్నారు. దానిని కూకటి వేళ్లతో జగన్ పికిలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు కూడా.
అసలు మార్గదర్శి కేసు విషయంలో జగన్ పట్టించుకోరని రామోజీరావు భావించారు. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరిస్తారని అంచనా వేశారు. తన జోలికి రారని కూడా భావించారు. కానీ జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐడితో చుక్కలు చూపిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అయితే.. రామోజీరావు ఇట్టే తప్పించుకుంటారని జగన్ అంచనా వేశారు. అందుకే తన చెప్పు చేతల్లో ఉన్న సిఐడిని ప్రయోగించారు. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా పెడుతున్నారు. చివరకు అగ్నిమాపక శాఖను సైతం ఉసిగొల్పారు. వీటన్నిటిని చూసి రామోజీ బెంబేలెత్తిపోతున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే జగన్ పెట్టే ఇబ్బందులను ఊహిస్తున్నారు. అందుకే తన మీడియా ద్వారా ఎలాగైనా జగన్ అధికారంలోకి రాకూడదని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రామోజీలలో చూడని భయం.. ఇప్పుడు కనిపిస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
