Ramiz Raja: పాకిస్థాన్ కప్పు కొడుతుంది అంటే నవ్వొస్తుంది.. …నవ్వచ్చా..
నిజానికి వాళ్ళు ఓడించింది ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు అయిన పాకిస్థాన్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది అని చెప్పవచ్చు కానీ వాళ్లు ఓడించింది బచ్చా బంగ్లాదేశ్ టీమ్ ని దానికే వాళ్ళు ఇంత గర్వంతో పొంగిపోవడలు చూసిన ప్రపంచ క్రికెట్ అభిమానులకి వాళ్ల తీరు నచ్చడం లేదు.

Ramiz Raja: ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతున్న నేపథ్యం లో ఇండియన్ టీమ్ వరుసగా మ్యాచ్ లు గెలుస్తుంటే, పాకిస్థాన్ వరుసగా మ్యాచ్ లు ఓడిపోతు వస్తుంది మొదట రెండు మ్యాచ్ లు గెలిచినప్పటికి ఆ తర్వాత ఆడిన 4 మ్యాచులు వరుసగా ఒడిపోయింది. ఇక దాంతో పాకిస్థాన్ సెమీస్ చేరడం కష్టం అనుకుంటున్న టైం లో నిన్న బంగ్లాదేశ్ మీద ఆడిన ఒక మ్యాచ్ పాకిస్థాన్ మళ్ళీ విజయం సాధించింది.
ఇక దాంతో వాళ్ళు సెమీ ఫైనల్ రేస్ లో కొంచం ముందుకు వచ్చారు దాంతో మళ్లీ పాకిస్థాన్ వాళ్లలో గర్వం పైకి వచ్చి ఈసారి కప్పు మాదే అంటూ హడావిడి చేస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నిజానికి వాళ్ళు ఓడించింది ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు అయిన పాకిస్థాన్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది అని చెప్పవచ్చు కానీ వాళ్లు ఓడించింది బచ్చా బంగ్లాదేశ్ టీమ్ ని దానికే వాళ్ళు ఇంత గర్వంతో పొంగిపోవడలు చూసిన ప్రపంచ క్రికెట్ అభిమానులకి వాళ్ల తీరు నచ్చడం లేదు…
ఇక ఈ క్రమం లోనే పాకిస్థాన్ కి చెందిన రమీజ్ రాజ ఫీల్డ్ కామెంటరీ చేస్తూ పాకిస్థాన్ కి కప్పు వస్తుంది అంటే నాకు నవ్వు వస్తుంది, నవ్వచ్ఛా అని పాకిస్థాన్ దేశాన్ని పర్మిషన్ అడిగారు. ఇది చూసిన చాలా మంది పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడిప్పుడే పాకిస్థాన్ వరుస మ్యాచ్ లు గెలుస్తుంటే మన దేశం తరుపున చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడిన ప్లేయర్ గా మన పరువు తీస్తావా అంటూ రమిజ్ రాజా మీద పాకిస్థాన్ దేశం మొత్తం చాలా ఫైర్ గా ఉంది…
ఇక ఇలాంటి క్రమం లో ఆయన చెప్పిన దాంట్లో తప్పేం ఉంది పాకిస్థాన్ టీమ్ ప్రస్తుతం ఆడుతున్న ఆట తీరు చాలా దారిద్రం గా ఉంది.ఇక పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెమీస్ కే వెళ్ళడం కష్టం గా ఉంటే,కప్పు గెలుస్తుంది అంటే కామెంట్లు చేస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది అంటూ మరి కొందరు రమిజ్ రాజా కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు…ఇక పాకిస్థాన్ ఆడాల్సిన రెండు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయిన కూడా పాకిస్థాన్ సెమీస్ కి వెళ్ళదు. అలాగే రెండింటిలో రెండు గెలిచిన వాళ్లు నెట్ రన్ రేట్ ని బట్టి ముందుకు కదలాల్సి ఉంటుంది.ఇక ఇలాంటి క్రమం లోనే ఒక్క గెలుపుతో మళ్ళీ కప్పు మాదే అంటూ పాకిస్థాన్ అభిమానులు సందడి చేస్తూ
అతి చేయడం మాత్రం తగ్గించుకోలేదు…
