Ram Gopal Varma: జైల్లో చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదు… చంద్రబాబు జైల్లో దోమలతో ఇబ్బంది పడుతున్నారు.. మా నాన్నను జైల్లో హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారు.. స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును ములాఖత్ ద్వారా కలిసిన తర్వాత నారా భువనేశ్వరి, యనమల రామకృష్ణుడు, చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌బాబు చేసిన కామెంట్స్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చంద్రబాబుపై మీమ్స్‌కు కారణం అవుతున్నాయి. అధికార వైసీపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ ఆరోపణలతో బాబుకు సానిభూతి రాకపోగా, నవ్వులపాలు అవుతున్నారు.
జైలన్నాక దోమలుండవా..
జైలు అంటేనే నేరం చేసిన వాళ్లు వెళ్లేది. అక్కడ శిక్షలు అమలు చేస్తారు కానీ రాచ మర్యాదులు చేయరు. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి అన్నప్పుడు జైళ్లు కూడా అందరికీ ఒకేలా ఉంటాయి. కానీ, టీడీపీ నాయకులు మాత్రం చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని అంటున్నారు. కోర్టు కూడా చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక గది కేటాయించాలని, ఇంటి నుంచే భోజనం అనుమతించాలని ఆదేశించింది. ఆమేరకే అందుతున్నాయి. కానీ, దోమల కుడుతున్నాయని రాజకీయం చేయడమే ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతోంది. టీడీపీ ఆరోపణలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్ప కొడుతున్నారు. జైల్లో దోమలు ఉండక ఏముంటాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
డెంగీతో ఖైదీ మరణించాడని..
మొదట బాబును జైల్లో ఉంచినప్పుడు సహచర ఖైదీలతో ముప్పు ఉంటుందన్న టీడీపీ నేతలు.. ఇప్పుడు దోమలతో ముప్పు ఉందని అంటున్నారు. ఇందుకు కారణం కూడా చూపుతున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న ఓ ఖైదీ ఇటీవల డెంగీతో మరణించాడట. దీంతో చంద్రబాబును కూడా డెంగీ దమలతో కుటుంచి చంపాలనుకుంటున్నారన్నది టీడీపీ నేతల వాదన. కానీ, ప్రత్యేక సెల్, సౌకర్యాలు కల్పించినప్పుడు బాబు కనీసం దోమలను కూడా తోలుకోలేడా అన్నది వైసీపీ నేతల ప్రశ్న.
ఆర్జీవీ పంచ్..
ఇక ఈ దోమల వ్యవహారంలోకి తాజాగా స్టార్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ(ఆర్టీవీ) ఎంటర్ అయ్యాడు. తనదైన శైలిలో పంచులు పేల్చారు. ఇది రక్తచరిత్ర కాదు.. దోమచరిత్ర.. అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. దోమల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో దోమల నిర్మూలన కోసం దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టారు. దోమల వృద్ధికి కారణాలు వివరించారు. అయితే అదే వీడియోను ఆర్జీవీ ఇప్పుడు తన సెటైర్‌కు వాడుకున్నాడు.. నాడు బాబు దోమలపై దండయాత్ర చేయడంతో ఇప్పుడు అవే దోమలు పగ తీర్చుకోవాలని చూస్తున్నాయంటూ పేర్కొన్నాడు.
ఆ దోమలే ఇప్పుడు C B N మీద పగ తీర్చుకుంటున్నాయా ??? ఇది రక్త చరిత్ర కాదు… ఇది దోమ చరిత్ర pic.twitter.com/9BKyb9Vibm
— Ram Gopal Varma (@RGVzoomin) September 24, 2023