Sunishith- Ramcharan Fans: ‘సునిశిత్ ‘ ని చితకబాదిన రామ్ చరణ్ ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
డైరెక్టర్స్ మీద నాకు అన్యాయం చేసారు అంటూ మీడియా ముందుకి వచ్చి తెగ రచ్చ చేసాడు.కేవలం హీరోల మీదనే కాదు, లావణ్య త్రిపాఠి, తమన్నా తన లవర్స్ అంటూ అప్పట్లో వాళ్ళ మీద అభియోగాలు వేసాడు.

Sunishith- Ramcharan Fans: సెలబ్రిటీస్ మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ సోషల్ మీడియా లో బాగా ఫేమస్ అయినా వ్యక్తి సునిశిత్. ఈ పేరు చెప్పగానే ఇతను చేసిన దరిద్రాల గురించి అన్నీ మనకి గుర్తుకు వస్తాయి. మహేష్ బాబు , ఎన్టీఆర్ , రవితేజ ఇలా ఎంతో మంది హీరోల మీద అభియోగాలు వేసాడు.
డైరెక్టర్స్ మీద నాకు అన్యాయం చేసారు అంటూ మీడియా ముందుకి వచ్చి తెగ రచ్చ చేసాడు.కేవలం హీరోల మీదనే కాదు, లావణ్య త్రిపాఠి, తమన్నా తన లవర్స్ అంటూ అప్పట్లో వాళ్ళ మీద అభియోగాలు వేసాడు. ఇన్ని చేసిన సునిశిత్ పై పోలీసులు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసారు. మరోసారి ఇంటర్వ్యూస్ ఇచ్చినా, నోటికి వచ్చినట్టు మాట్లాడిన చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
కొంతకాలం సైలెంట్ గా ఉన్న సునిశిత్ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ప్రారంభించాడు.ఈసారి అతను రామ్ చరణ్ – ఉపాసన మీద కామెంట్స్ చేసాడు, ఉపాసన తో అప్పట్లో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళేవాడిని అని, స్వయంగా రామ్ చరణ్ మా ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేసాడని ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు.
ఇవన్నీ సరిపోవు అన్నట్టు చిరంజీవి పెద్ద కూతురు ‘సుస్మిత’ ని కూడా నేను పెళ్లి చేసుకోవాల్సింది అని, కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయాను అంటూ కామెంట్ చేసాడు. ఇవన్నీ విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ఇంటికి వెళ్లి అతనిని చితకబాదారు, దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అతని చేత క్షమాపణలు చెప్పించి మళ్ళీ ఇలాంటి కామెంట్స్ ఎవ్వరి మీద చెయ్యను అని అనిపించారు రామ్ చరణ్ ఫ్యాన్స్.
https://twitter.com/Karthik4PSPK/status/1657302121665138693?s=20
