Romantic: పూరి జగన్నాథ్ ఎలాగైనా తన కొడుకును హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. గతంలో తన తమ్ముడు విషయంలో చేసిన పొరపాట్లను కొడుకు విషయంలో చేయకూడదు అని పూరి కాస్త గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. అందుకే ఆకాష్ పూరి హీరోగా వస్తోన్న రొమాంటిక్ సినిమాకి సాధ్యమైనంత వరకు స్పెషల్ ఎట్రాక్షన్లను యాడ్ చేయడానికి పూరి పర్ఫెక్ట్ ప్లాన్ ముందుకు వెళ్ళాడు.
పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాయడంతో పాటు.. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేలా ఆమెను రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించాడు. ఇక ప్రభాస్ ను ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యేలా చూసుకున్నాడు. అలాగే రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను తీసుకొచ్చి భారీ హంగామా చేయించాడు. ఇక ఎవరికీ తెలియని అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది.
ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ గెస్ట్ ఎప్పిరియన్స్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సినిమాలో ‘పీనే కే బాద్’ అనే పబ్ సాంగ్ ఒకటి ఉంది. ఈ సాంగ్ లిరికల్ వీడియోను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటలో లిరిక్స్ చాలా క్యాచిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అయితే, ఈ పాటకు దక్కన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పాటలో హీరో రామ్ కనిపించబోతున్నాడు.
ఓ అదిరిపోయే స్టెప్ వేయబోతున్నాడు. అన్నట్టు పూరి కూడా ఈ సాంగ్ లో కనిపిస్తారట. ఈ సాంగ్ లో రామ్ వేసిన మాస్ స్టెప్పులు అదిరిపోయాయట. రామ్ మంచి డ్యాన్సర్. మొత్తానికి రొమాంటిక్ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది అన్నమాట. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తనకు ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం రామ్ ఈ సినిమాలో నటించినట్టు ఉన్నాడు.
అలాగే రామ్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పాడు. రామ్ వాయిస్ ఫుల్ ఎనర్జీ.. అలాంటి రామ్ వాయిస్ తో రొమాంటిక్ మొదలు కాబోతుందంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. కాగా కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పూరి నిర్మిస్తున్నారు. కొడుకు కోసం పూరి చేస్తున్న మరో రిస్క్ ప్రాజెక్టు ఇది.
Also Read: Samantha: కుమార్తె పెళ్లి కోసం కాదు… ఆమె చదువు కోసం డబ్బు దాచి పెట్టండి : సమంత