Pawan Kalyan- Ram Gopal Varma: పవన్ కల్యాణ్ పై రాంగోపాల్ వర్మ ట్వీట్.. మళ్లీ దుమారం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పొలిటికల్ గా కీలకంగా మారాడు. ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి పలు పార్టీలు వెంటపడుతున్నాయి. అయితే పవన్ మాత్రం ఇప్పటి వరకు బీజేపీతోనే స్నేహం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

Pawan Kalyan- Ram Gopal Varma: సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాల కంటే సోషల్ మీడియాలోనే తన పర్ఫామెన్స్ చూపిస్తూ ఉంటారు. కొన్ని సార్లు హీరోయిన్లతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తారు. మరికొన్ని సార్లు సమాజంలో జరిగే పరిస్థితులపై చర్చిస్తూ ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ విషయంలో ఆయన వరుస పోస్టులు పెడుతూ వంగ్యాస్త్రాలు విసురుతూ ఉంటారు. పవన్ ను బేస్ చేసుకొని ఓ సినిమానే బయటకు తెచ్చిన ఆర్టీవీ అంటే పవన్ ఫ్యాన్స్ ఒంటికాలుపై లేస్తారు. అయినా ఆయన పోస్టులు పెట్టడం మానడ లేదు. లేటేస్టుగా ఆర్జీవి చేసిన ఓ పోస్టు పొలిటికల్ సర్కిల్లో దుమారం రేపుతోంది. ఓ ఫన్నీ వీడియోతో మిక్స్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పొలిటికల్ గా కీలకంగా మారాడు. ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి పలు పార్టీలు వెంటపడుతున్నాయి. అయితే పవన్ మాత్రం ఇప్పటి వరకు బీజేపీతోనే స్నేహం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. టీడీపీ విషయంలో పైపైన మైత్రి బంధం కొనసాగిస్తున్నా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వైసీపీని గద్దె దించాలంటే మాత్రం ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని నినదిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు కలవాలని అంటున్నారు. దీంతో టీడీపీ సైతం పవన్ తో కలిసి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈమేరకు పవన్ తో టీడీపీ నేత చంద్రబాబు పలుసార్లు సమావేశం అయ్యారు కూడా.
మరోవైపు జనసేన ఫ్యాన్స్ ఎప్పటి నుంచి పవన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది జనసైనికులు పార్టీ కోసం రాత్రిబవళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. కొందరు సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ పరిణమాల దృష్ట్యా పవన్ తాను సీఎం అభ్యర్థిగా ఉండాలని అనుకోవడం లేదని ఇటీవలో ఓ సమావేశంలో చెప్పాడు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిత్యం పోరాడుతూ ఉంటానని, సీఎం కావాలన్న కోరిక లేదని అన్నారు.
ఈ వీడియోపై ఆర్జీవీ స్పందించారు. ఇన్నాళ్లు జనసేనపై పెట్టుకున్న నమ్మకాన్ని పవన్ వంచించారని వ్యంగాస్త్రం విసిరాడు. గతంలో చంద్రబాబు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని, ఇప్పుడు పవన్ కల్యాణ్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన రాబోయే చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని ఓ వీడియోను మిక్స్ చేసి ఫన్నీగా తయారు చేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొందరు వార్నింగ్ లతో పోస్టులు పెడుతున్నారు. పవన్ అన్నపై కామెంట్లు చేసే హక్కు లేదని అంటున్నారు. అయితే ఆర్జీవి మాత్రం అలాంటి కామెంట్స్ పట్టించుకోవడం లేదు. పైగా కొందరు చేసేకామెంట్లకు లైక్ లు కొట్టినట్లు కనిపిస్తోంది. మరి ఆర్జీవి చేసినట్లు పవన్ నిజంగానే తనకు తాను వెన్నుపోటు పొడుచుకుంటున్నాడా? రాజకీయంలో అసలేం జరుగుతోంది? అన్న చర్చ ప్రారంభమైంది.
