Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అంటున్న ఆర్జీవీ… టార్గెట్ అతనేనా ?

Ram Gopal Varma: టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి తీవ్ర దుమరాన్ని రేపుతుంది. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి, సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అలానే సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. దాసరి తరువాత ఆ స్థానంలో మెగాస్టార్ ఇండస్ట్రి పెద్ద దిక్కుగా రావాలంటూ పలువురు ప్రముఖులు కోరుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మోహన్ బాబు ఉండాలంటూ […]

Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అంటున్న ఆర్జీవీ… టార్గెట్ అతనేనా ?

Ram Gopal Varma: టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి తీవ్ర దుమరాన్ని రేపుతుంది. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి, సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అలానే సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. దాసరి తరువాత ఆ స్థానంలో మెగాస్టార్ ఇండస్ట్రి పెద్ద దిక్కుగా రావాలంటూ పలువురు ప్రముఖులు కోరుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మోహన్ బాబు ఉండాలంటూ మరో వర్గం కోరుతుంది.

ram gopal varma reply to ajay bhupathi tweet about tollywood

ఇటీవల ఈ విషయంపై స్పందించిన చిరు.. తనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికైనా సాయం చేయాలంటే ముందుకొస్తాను కానీ.. ఇద్దరు గొడవ పడితే దాన్ని పరిష్కరించడానికి మాత్రం ముందుకు రానని తేల్చి చెప్పారు చిరంజీవి. ఇక ఇదిలా ఉండగా ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తన గురువు రామ్ గోపాల్ వర్మను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలంటూ ట్వీట్ పెట్టారు. ‘మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి సామీ’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

తాజాగా అజయ్ పెట్టిన ట్వీట్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ‘అజయ్ గారూ… ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం… ఎందుకంటే, ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి… దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు కానీ… ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు’ అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

https://twitter.com/RGVzoomin/status/1478345824807493633?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1478345824807493633%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fram-gopal-varma-reply-to-ajay-bhupathi-16902

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు