Upasana : ఒంటరి తల్లుల కోసం రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కీలక నిర్ణయం… ఒక తల్లిగా వాళ్ళ బాధను అర్థం చేసుకుని!
సింగిల్ మదర్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ అనేది అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి వీకెండ్ మా ఆసుపత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ అందించబోతున్నాం.

Upasana : మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చి మరో పెద్ద కుటుంబానికి కోడలుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా హోదా చూపించకుండా డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి గా సామాజిక సేవ చేయడంలో ముందు ఉండే వ్యక్తి గా మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్ గా తల్లి గా ప్రమోట్ అయిన ఉపాసన కొణిదెల అపోలో చిల్డ్రన్స్ లోగో ఆవిష్కరణ లో పాల్కొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. దానిని నేను అనుభవించాను. మన పిల్లలకు ఏదైనా చిన్న జబ్బు చేసిన తల్లి హృదయం ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు. ఆ జబ్బు తగ్గిన తర్వాత ఆ తల్లి పడే సంతోషం మాటల్లో చెప్పలేము. అలాంటి మధుర క్షణాలను పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్న డాక్టర్స్ కి నా ధన్యవాదాలు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అనేక మంది నాకు సలహాలు ఇచ్చారు. వాళ్లందరికీ థాంక్స్ .
పిల్లలను పెంచే విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆ విషయంలో రామ్ చరణ్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. కానీ చాలా మంది పిల్లలకు ఇలాంటి అండ దొరకదని తెలిసి బాధపడ్డాను. ముఖ్యంగా సింగిల్ మదర్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ అనేది అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి వీకెండ్ మా ఆసుపత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీ లో నా వంతు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.
ఉపాసన – రామ్ చరణ్ ల వివాహం 2012 లో జరిగిన కానీ దాదాపు పదేళ్ల దాకా పిల్లలు లేకపోవడంతో సామాన్య జనాలు మాదిరి వీళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వాటికీ శుభం కార్డు వేస్తూ ఈ ఏడాది జూన్ లో పాపకు జన్మనించింది ఉపాసన. ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు. ఈ సమయంలో దాదాపు సినిమాలకు 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఉపాసనతో గడిపాడు. ఆ పాప పుట్టడం తో తమ ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని పంచుకున్నాడు.
