Tamannaah- Upasana: తమన్నాకు 2 కోట్ల డైమండ్.. గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసన..? ఎందుకో తెలుసా ?
2005 లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఆమె నటించిన జైలర్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మరి కొన్నేళ్లు తమన్నా హవా నడిచే అవకాశం ఉంది. అదే విధంగా వెబ్ సిరీస్ లోను నటిస్తూ సత్తా చూపిస్తున్న తమన్నా, విజయ్ వర్మ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.

Tamannaah- Upasana: టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ మీద చర్చ నడుస్తుంది. ప్రముఖ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా దాదాపు 2 కోట్ల విలువైన డైమండ్ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ డైమండ్ తమన్నాకు గిఫ్ట్ గా వచ్చినట్లు అది కూడా ఒక స్టార్ హీరో వైఫ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. ఆ స్టార్ హీరో వైఫ్ ఎవరో కాదు ఉపాసన కొణిదెల.
అవును దాదాపు 2 కోట్ల విలువైన డైమండ్ ను ఉపాసన స్వయంగా తమన్నా కు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్స్ తో ఉపాసన కు మంచి బాండింగ్ ఉంది. పైగా రచ్చ మూవీ లో రామ్ చరణ్, తమన్నా కలిసి నటించినప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఇంకా పెరిగింది. ఆ తర్వాత చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా నటించింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత తమ గుర్తుగా ఆ డైమండ్ ను తమన్నాకు స్పెషల్ గిఫ్ట్ గా ఉపాసన ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ అని తెలుస్తుంది. దీంతో ఈ డైమండ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
2005 లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఆమె నటించిన జైలర్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మరి కొన్నేళ్లు తమన్నా హవా నడిచే అవకాశం ఉంది. అదే విధంగా వెబ్ సిరీస్ లోను నటిస్తూ సత్తా చూపిస్తున్న తమన్నా, విజయ్ వర్మ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.
ఇటీవల అధికారికంగా ప్రకటించారు. విజయ్ వర్మ నన్ను బాగా చూసుకుంటాడు, రక్షణగా ఉంటాడనే నమ్మకం ఉంది. అందుకే అతన్ని ప్రేమించానని తమన్నా వెల్లడించారు. తమన్నా-విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2లో కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. త్వరలోనే వీళ్లిద్దరు వివాహబంధం లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని సమాచారం.